NZ vs AUS 1st T20: బౌండరీల వర్షం.. ఆసీస్‌పై దంచి కొట్టిన CSK జోడీ

NZ vs AUS 1st T20: బౌండరీల వర్షం.. ఆసీస్‌పై దంచి కొట్టిన CSK జోడీ

అంతర్జాతీయ క్రికెట్ లో చెన్నై స్టార్ ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. ఓపెనర్ కాన్వే, టాపార్డర్ బ్యాటర్ రచీన్ రవీంద్ర అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. ఆసీస్ పై సెంచరీ భాగస్వామ్యంతో న్యూజిలాండ్ కు భారీ స్కోర్ అందించారు. ఐపీఎల్ కు ముందు అద్భుతంగా ఆడుతూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. కాన్వే 46 బంతుల్లో 2 సిక్సులు, 5 ఫోర్లతో 63 పెరుగు చేస్తే.. రవీంద్ర 35 బంతుల్లో 6 సిక్సులు, 2 ఫోర్లతో 68 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియాపై జరుగుతున్న తొలి టీ20లో భాగంగా వీరిద్దరి జోడీ రెండో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. కాన్వే, రచీన్ రవీంద్ర హాఫ్ సెంచరీలతో పాటు ఫిన్ అలెన్ 32 పరుగులు చేసి తన వంతు పాత్రను పోషించాడు. చివర్లో ఫిలిప్స్, చాప్ మన్ మెరుపులు మెరిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమ్మిన్స్, స్టార్క్, హేజల్ వుడ్ తలో వికెట్ తీసుకున్నారు.  
 
ప్రస్తుతం చెన్నై జట్టులో ఓపెనర్ కాన్వే కొనసాగుతుండగా.. ఐపీఎల్ 2023 మినీ వేలంలో సూపర్ కింగ్స్ జట్టు 1.8 కోట్లకు రచీన్ ను దక్కించుంది. భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో అంచనాలకు మించి రాణించిన ఈ కివీస్ ఆల్ రౌండర్.. తొలిసారి ఐపీఎల్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు.  ఫార్మాట్ ఏదైనా ఈ యువ క్రికెటర్ తగ్గేదే లేదంటున్నాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ చేసి  టాప్ ఫామ్ లో ఉన్నాడు. ఇక ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న కాన్వే హాఫ్ సెంచరీ చేయడంతో CSK పండగ చేసుకుంటున్నారు.