ODI World Cup 2023: అప్పుడు సచిన్.. ఇప్పుడు రచిన్: క్రికెట్ గాడ్ రికార్డ్ సమం చేసిన కివీస్ ఆల్ రౌండర్

న్యూజిలాండ్ యంగ్ సంచలనం రచిన్ రవీంద్ర వరల్డ్ కప్ లో చెలరేగి ఆడుతున్నాడు. ఆడుతున్నది మొదటి వరల్డ్ కప్ అయినా.. భారత్ గడ్డపై అవగాహన లేకున్నా పరుగుల వరద పారిస్తున్నాడు. అంచనాలకు మించి ఆడుతున్న రచిన్ .. ఆడిన ఆరు మ్యాచుల్లో 406 పరుగులు చేసి ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డ్ సమం చేసాడు. 

వరల్డ్ కప్ లో ఈ కివీస్ ఆల్ రౌండర్ అప్పుడే రెండు సెంచరీలు బాదేశాడు. ప్రారంభ మ్యాచులో ఇంగ్లాండ్ పై సెంచరీ చేసిన రచిన్ .. నిన్న (అక్టోబర్ 28) ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియా మీద మరో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 89 బంతుల్లో 116 పరుగులు చేసిన రవీంద్ర ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. దీంతో వరల్డ్ కప్ డెబ్యూలోనే రెండు సెంచరీలు ఆటగాడిగా సచిన్ రికార్డ్ సమం చేసాడు. 

ALSO READ :- డయాబెటిక్ రోగులు రోజుకు ఎన్ని గుడ్లు తినాలంటే..

1996 లో సచిన్ తన తొలి వరల్డ్ కప్ లోనే రెండు సెంచరీలు చేసాడు. ఇక ఇప్పటివరకు విలియంసన్(2019), టర్నర్(1975), గప్తిల్ (2015) మాత్రమే ఈఘనత సాధించాడు తాజాగా రచీన్ రవీంద్రా ఈ అరుదైన లిస్టులోకి చేరిపోయాడు.అయితే 24 ఏళ్ళ లోపు ఈ ఘనత సాధించిన ప్లేయర్ గా సచిన్ తో పాటు రచిన్ మాత్రమే ఉన్నాడు. లీగ్ లో ఇంకా మ్యాచులు ఉన్నాయి కాబట్టి మరో సెంచరీ చేసి సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన ఆశ్చర్యం లేదు. అదే జరిగితే సచిన్ పేరులో సగం పెట్టుకున్న రచిన్.. క్రికెట్ గాడ్ పేరుకు న్యాయం చేసినవాడవుతాడు.