
ఐసీసీ టోర్నీలో సెంచరీ కొట్టడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ మ్యాచ్ లతో పోలిస్తే మెగా ఈవెంట్స్ లో ఆటగాళ్లపై ఎక్కువగా ఒత్తిడి ఉంటుంది. స్టార్ బ్యాటర్లు సైతం ఐసీసీ టోర్నీల్లో సెంచరీలు కొట్టడానికి తడబడతారు. కానీ న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచీన్ రవీంద్రకు మాత్రం ఐసీసీ ఈవెంట్ అంటే పూనకం వస్తుంది. అలవోకగా సెంచరీలు బాదేస్తున్నాడు. బాదేస్తాడు. సోమవారం (ఫిబ్రవరి 24) ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ పై వీరోచిత సెంచరీ(105 బంతుల్లో 112:12 ఫోర్లు, ఒక సిక్సర్)చేసి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
బంగ్లాదేశ్ పై సెంచరీతో ఐసీసీ వన్డే ఈవెంట్స్ లో రచీన్ తన సెంచరీలను నాలుగుకు పెంచుకున్నాడు. దీంతో ఐసీసీ వన్డే ఈవెంట్స్ లో న్యూజిలాండ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా నిలిచి కేన్ విలియమ్సన్, నాథన్ ఆస్టిల్‌లను అధిగమించాడు. ఈ మ్యాచ్ కు ముందు వరకు విలియంసన్, నాథన్ ఆస్టిల్ తో కలిసి రచీన్ రవీంద్ర 3 సెంచరీలతో సమానంగా ఉన్నాడు. అయితే బంగ్లాపై సెంచరీతో అగ్ర స్థానానికి దూసుకెళ్లాడు. కేవలం 11 ఇన్నింగ్స్ ల్లోనే రచీన్ నాలుగు సెంచరీలు బాదడం విశేషం. ఈ క్రమంలో సచిన్ రికార్డును ఈ కివీస్ ఆల్ రౌండర్ బ్రేక్ చేశాడు.
25 ఏళ్ళ వయసులో ఐసీసీ వన్డే ఈవెంట్స్ లో అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడిగా సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ 25 ఏళ్ళ వయసులో మూడు ఐసీసీ వన్డే సెంచరీలు చేస్తే.. రచీన్ నాలుగు సెంచరీలతో క్రికెట్ గాడ్ ను వెనక్కి నెట్టాడు. భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్‌లపై మూడు సెంచరీలు చేసిన రచీన్.. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ పై సెంచరీ బాదాడు. ఈ టోర్నీలో న్యూజిలాండ్ కనీసం రెండు మ్యాచ్ లు ఆడనుంది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే సోమవారం జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో బంగ్లాను చిత్తు చేసిన న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (77; 110 బంతుల్లో 9 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఛేదనలో 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి గెలిచింది. రచిన్ రవీంద్ర (112) సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. లాథమ్(55) హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ తో రాణించాడు.
RACHIN RAVINDRA MADE HIS ODI DEBUT IN 2023 🥶
— Johns. (@CricCrazyJohns) February 24, 2025
- This is insane stat for 25 year old Rachin. pic.twitter.com/8QsffVt3il