Champions Trophy 2025: రచీన్ రవీంద్ర మరో సెంచరీ.. సఫారీలపై కివీస్ పరుగుల వరద

Champions Trophy 2025: రచీన్ రవీంద్ర మరో సెంచరీ.. సఫారీలపై కివీస్ పరుగుల వరద

ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికాతో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటింగ్ లో అదరగొడుతుంది. లాహోర్ వేదికగా గడాఫీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రచీన్ రవీంద్ర సెంచరీతో కివీస్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడుతున్న రచీన్ 93 బంతుల్లో తన సెంచరీ మార్క్ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి. ఓవరాల్ గా రచీన్ రవీంద్ర వన్డే కెరీర్ లో ఇది ఐదో సెంచరీ కాగా.. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో రెండోది. 

ALSO READ | Champions Trophy 2025: సెమీ ఫైనల్‌కు కాన్వేను పక్కన పెట్టిన న్యూజిలాండ్

రచీన్ రవీంద్రతో పాటు స్టార్ బ్యాటర్ విలియంసన్ (64) హాఫ్ సెంచరీ చేయడంతో న్యూజిలాండ్ తొలి 32 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 201 పరుగులు చేసింది. క్రీజ్ లో రచీన్ రవీంద్ర (105), విలియంసన్ (72) ఉన్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు అజేయంగా 153 పరుగులు జోడించడం విశేషం. 21 పరుగులు చేసి యంగ్ ఔటయ్యాడు. ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన విలియంసన్, రచీన్ రవీంద్ర సఫారీ బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. సింగిల్స్ తీస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో అలవోకగా కివీస్ కు పరుగులు వచ్చాయి. మరో 18 ఓవర్లు ఉండడంతో ఈ మ్యాచ్ లో కివీస్ 350 పరుగుల స్కోర్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.