Champions Trophy 2025: ఆ రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడతాయి: రచీన్ రవీంద్ర జోస్యం

పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్, టీమిండియా ఫేవరేట్స్ గా బరిలోకి దిగుతున్నాయి. ఆసియా గడ్డపై ఆడుతుండడం ఈ రెండు జట్లకు కలిసి వస్తుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సైతం టైటిల్ రేస్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచీన్ రవీంద్ర ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు వెళ్లే జట్లేవో జోస్యం చెప్పాడు. 

ఐసీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ కివీస్ ఓపెనర్ ను ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరుకునే రెండు జట్లేవో చెప్పాల్సిందిగా అడిగారు. ఈ ప్రశ్నకు రచీన్ మాట్లాడుతూ.. " ఫైనలిస్టులను అంచనా వేయడం ఎప్పుడూ చాలా కష్టం. న్యూజిలాండ్ తో పాటు ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడతాయి. ఆస్ట్రేలియా చాలా పటిష్టమైన జట్టు. అన్ని ఫార్మాట్ లలో వారు ఎంత బలంగా ఉంటారో ఇప్పటికే నిరూపించారు". అని రవీంద్ర చెప్పాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో తన దేశానికి తరపున ఆడదానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్నాని తెలిపాడు. 

Also Read : ఛాతీపై బంతి తగిలి మరణించిన 16 ఏళ్ల గోల్ కీపర్

భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో రచీన్ రవీంద్ర అద్భుతంగా రాణించాడు. 500కు పైగా పరుగులు చేసి న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఓవరాల్ గా 28 వన్డేల్లో 945 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ లో 18 వికెట్లు పడగొట్టాడు. ఆసియాలో స్పిన్ పిచ్ లు విజయంలో కీలక పాత్ర పోషించనుడడంతో రచీన్ రవీంద్రపై కివీస్ భారీ అంచనాలు పెట్టుకుంది.  2017 తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది. తొమ్మిదో ఎడిషన్ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది.