IND vs NZ, 2nd Test: రచీన్ రవీంద్ర, కాన్వే అర్ధ సెంచరీలు.. కివీస్‌కు సుందర్ షాక్

IND vs NZ, 2nd Test: రచీన్ రవీంద్ర, కాన్వే అర్ధ సెంచరీలు.. కివీస్‌కు సుందర్ షాక్

పూణే టెస్టులో న్యూజిలాండ్ అద్భుతంగా ఆడి తడబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కివీస్.. మొదట భారత బౌలర్లకు అంత సులువుగా వికెట్లను ఇవ్వట్లేదు. కాన్వే, రచీన్ రవీంద్ర హాఫ్ సెంచరీలు చేయడంతో న్యూజిలాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే  తొలి రోజు టీ విరామ సమయానికి ముందు సుందర్ మ్యాజిక్ చేశాడు. రచీన్ రవీంద్ర(65), బ్లండెల్(4) వికెట్ తీసుకొని కివీస్ ను కష్టాల్లోకి నెట్టాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. క్రీజ్ లో మిచెల్ (16) ఉన్నాడు.  

2 వికెట్ల నష్టానికి 92 పరుగులతో రెండో సెషన్ ఆరంభించిన న్యూజిలాండ్ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగింది. లంచ్ తర్వాత తొలి ఓవర్ లోనే కాన్వే బుమ్రా బౌలింగ్ లో 3 ఫోర్లు కొట్టి దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఈ క్రమంలో కాన్వే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్ కు రచీన్ తో 62 పరుగులు జోడించిన తర్వాత 76 పరుగులు కాన్వే ఔటయ్యాడు .ఈ వికెట్ అశ్విన్ కు దక్కింది. 

డారిల్ మిచెల్ తో కలిసి రచీన్ రవీంద్ర ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 65 పరుగులు చేసి జోరు మీదున్న రవీంద్ర టీ విరామ సమయానికి ముందు ఔటయ్యాడు. ఆ తర్వాత ఓవర్లోనే బ్లండెల్(3) ను బౌల్డ్ చేసి భారత్ శిబిరంలో ఆనందం నింపాడు. భారత బౌలర్లలో అశ్విన్ కు మూడు వికెట్లు దక్కాయి. సుందర్ రెండు వికెట్లు తీసుకున్నాడు.