ODI World Cup 2023: ఆసీస్‌పై వీరోచిత ఇన్నింగ్స్.. కోహ్లీని వెనక్కినెట్టిన రచిన్ రవీంద్ర

ODI World Cup 2023: ఆసీస్‌పై వీరోచిత ఇన్నింగ్స్.. కోహ్లీని వెనక్కినెట్టిన రచిన్ రవీంద్ర

భారత గడ్డపై న్యూజిలాండ్‌ యువ క్రికెటర్ రచిన్‌ రవీంద్ర చెలరేగిపోతున్నాడు. కెరీర్‌లో తొలి వరల్డ్ కప్ ఆడుతున్నా.. అగ్రశ్రేణి జట్ల బౌలర్లను తునాతునకలు చేస్తున్నాడు. ఇంగ్లండ్‌పై 82 బంతుల్లోనే సెంచరీ చేసిన ఈ యువ బ్యాటర్.. శనివారం ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో విధ్వంసకర శతకం బాదాడు. 77 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు.

ఈ టోర్నీలో ఇప్పటివరకూ 6 మ్యాచ్‌లు ఆడిన రచిన్ రవీంద్ర 2 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 406 పరుగులు చేశాడు. దీంతో అత్యధిక పరుగుల ఆటగాళ్ల జాబితాలో భారత ఆటగాడు విరాట్‌ కోహ్లీ(354 పరుగులు)ని వెనక్కినెట్టి మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్‌ డికాక్‌ (431 పరుగులు), ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌(413) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 

  • 1. క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా): 431 పరుగులు
  • 2. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా): 413 పరుగులు
  • 3. రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్): 406 పరుగులు
  • 4. ఐడెన్ మార్క్ రమ్ (దక్షిణాఫ్రికా): 356 పరుగులు
  • 5. విరాట్ కోహ్లీ (భారత్): 354 పరుగులు