IND vs NZ 2024: బెంగళూరులో మ్యాచ్..న్యూజిలాండ్ క్రికెటర్‌కు సొంతగడ్డ

IND vs NZ 2024: బెంగళూరులో మ్యాచ్..న్యూజిలాండ్ క్రికెటర్‌కు సొంతగడ్డ

బెంగుళూరు లోని చిన్నస్వామి వేదికగా మంగళవారం(అక్టోబర్ 16) భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ జరగనుంది. భారత్ స్వదేశంలో ఈ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కివీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర సొంత గడ్డ కావడం విశేషం. రచిన్‌ రవీంద్ర న్యూజీలాండ్ క్రికెట్ జట్టు తరపున ఆడుతున్నా.. ఇతడి జన్మ స్థలం బెంగళూరు. బెంగళూరు లో క్లబ్ లెవల్ క్రికెట్ కూడా ఆడాడు.ఈ మ్యాచ్ కు ముందు మీడియాతో మాట్లాడిన ఈ యువ ఆల్ రౌండర్ బెంగళూరుపై తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

"నేను పుట్టి పెరిగిందంతా వెల్లింగ్టన్‌లోనే. న్యూజిలాండ్ కు చెందిన వ్యక్తి అయినప్పటికీ భారతీయ సంతతికి చెందినవాడిగా ఎంతో గర్వపడుతున్నాను. ఇప్పటికీ నా కుటుంబలో చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ సంప్రదాయాలు, అలవాట్లు నాకు బాగా నచ్చుతాయి. చిన్న స్వామి స్టేడియంలో ఆడడం నాకు ఇదే తొలిసారి కాదు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నప్పుడు ఈ మైదానంలో ఆడాను. నా ఆట చూడడానికి మా నాన్న వెల్లింగ్ టన్ నుంచి ఇక్కడకి వస్తాడు. ఆ క్షణాలను తలచుకుంటే ఎంతో ఆనదంగా ఉంది". అని రవీంద్ర చెప్పుకొచ్చాడు. 

ALSO READ |BGT 2024: ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌కు షమీ దూరం.. కన్ఫర్మ్ చేసిన రోహిత్ శర్మ

రచీన్ నాన్న పేరు రవి కృష్ణ మూర్తి. ఇతనొక సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్ట్. భారత నుంచి న్యూజిలాండ్ వలసవెళ్లిన వీరి కుటుంబం అక్కడే స్థిరపడ్డారు. క్రికెట్ మీద ఆసక్తితో రచీన్ రవీంద్ర బాగా ఆడి  న్యూజిలాండ్ జాతీయ జట్టులో సెలక్ట్ అయ్యాడు. ప్రస్తుతం రచీన్ రవీంద్ర సూపర్ ఫామ్ లో ఉన్నాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో సత్తా చాటిన ఈ యువ ఆల్ రౌండర్ తన బ్యాటింగ్ తో తొలి సారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో కివీస్ తరపున అన్ని ఫార్మాట్లలో చోటు దక్కించుకుని కీలక ప్లేయర్ గా ఎదిగాడు.