Champions Trophy 2025: ఏందిరా పాకిస్థానోళ్లు ఇట్టున్నరు.. న్యూజిలాండ్ క్రికెటర్ ఐఫోన్ చోరీ

Champions Trophy 2025: ఏందిరా పాకిస్థానోళ్లు ఇట్టున్నరు.. న్యూజిలాండ్ క్రికెటర్ ఐఫోన్ చోరీ

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచీన్ రవీంద్ర ఐఫోన్ పోగొట్టుకున్నాడు. పాకిస్థాన్ లో ఇటీవలే అతని ఐఫోన్ ను ఎవరో దొంగతనం చేశారు. ట్రై సిరీస్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో రచీన్ ముక్కుకు తీవ్ర గాయమైంది. క్యాచ్ అందుకునే క్రమంలో అతనికి ఫ్లడ్ లైట్స్ అడ్డు రావడంతో బంతిని అంచనా వేయలేకపోయాడు. దీంతో బంతి రచీన్ రవీంద్ర ముక్కుకు బలంగా తగిలింది. రక్త స్రావం విపరీతంగా రావడంతో అతన్ని లాహోర్ హాస్పిటల్ లో చేర్చారు.

హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఈ కివీస్ క్రికెటర్ ఐఫోన్ పోయింది. దీంతో ఈ న్యూజిలాండ్ ఆల్ రౌండర్ తీవ్ర నిరాశకు గురైనట్టు సమాచారం. అసలే పాకిస్థాన్ లో భద్రతపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఐఫోన్ పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ కివీస్ఆల్ రౌండర్ పూర్తిగా కోలుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం (ఫిబ్రవరి 19) పాకిస్థాన్ తో జరగబోయే తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండనున్నాడు. విల్ యంగ్ స్థానంలో ఓపెనింగ్ చేయనున్నాడు.

Also Read :- ముంబై మాజీ సెలెక్టర్ కన్నుమూత

గ్రూప్ ఏ న్యూజిలాండ్ జట్టు ఉంది. కివీస్ తో పాటు ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇదే గ్రూప్ లో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గా పాకిస్థాన్ బరిలోకి దిగుతుంది. మరో వైపు ఐసీసీ టోర్నీల్లో అద్భుతంగా ఆడుతున్న భారత్ కూడా టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. అయితే ఈ రెండు జట్ల కన్నా న్యూజిలాండ్ బలంగా ఉందనే మాట వాస్తవం. ఫామ్ పరంగా చూసుకున్నా.. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా చూసుకున్నా అసలైన ఫేవరేట్ కివీస్. పాకిస్థాన్ తో నేషనల్ కరాచీ స్టేడియంలో ట్రై సిరీస్ ఫైనల్లో పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించింది. 

మరోసారి అదే స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో కివీస్ స్పష్టంగా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ట్రై సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి టైటిల్ గెలుచుకోవడంతో ఆ జట్టు ఒక్కసారిగా పాకిస్థాన్, భారత్ జట్లకు హెచ్చరికలు పంపింది. కివీస్ జట్టులో ప్రతి ఒక్కరు ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు అనుకూలాంశం. విలియంసన్, మిచెల్, కాన్వే లకు తోడు ఆ జట్టులో సాంట్నర్, రచీన్ రవీంద్ర, బ్రేస్ వెల్ రూపంలో ముగ్గురు సాలిడ్ ఆల్ రౌండర్లు ఉన్నారు. బౌలింగ్ లో కొత్త కుర్రాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా విలియంసన్ సూపర్ ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు కొండంత బలం.