మార్మోగిన కరీంనగర్​.. వైభవంగా రాధాగోవిందుడి శోభాయాత్ర

 

  •  హరే రామ, హరే కృష్ణ నామస్మరణతో మార్మోగిన కరీంనగర్​
  • ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గంగుల

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో ఇస్కాన్ టెంపుల్ భూమిపూజ సందర్భంగా శనివారం సాయంత్రం నిర్వహించిన రాధాగోవిందుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది.  తెలంగాణ చౌక్‌‌‌‌ నుంచి ఆలయం నిర్మించే పీటీసీ ఏరియా వరకు హరేరామ హరే కృష్ణ ట్రస్ట్​ ఆధ్వర్యంలో  నిర్వహించిన ర్యాలీ.. రామ, కృష్ణ నామస్మరణతో మార్మోగింది.  ఇస్కాన్ సభ్యులైన పలువురు విదేశీ మహిళల డ్యాన్స్​లు యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

అనంతరం పీటీసీ ఎదురుగా కేటాయించిన మూడెకరాల స్థలంలో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి  రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్​చైర్మన్ బి.వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఒక వైపు టీటీడీ శ్రీవారి ఆలయం, మరోవైపు ఇస్కాన్ టెంపుల్ తో సిటీ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుందన్నారు.  

కార్యక్రమంలో  కలెక్టర్ బి.గోపి, బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్, లైబ్రరీ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్,  హరేరామ హరేకృష్ణ ప్రతినిధులు నరహరి స్వామి, మధుసూదన్‌‌‌‌ రెడ్డి, రాజేందర్‌‌‌‌ రెడ్డి, నరేశ్‌‌‌‌ రెడ్డి, కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు దుండ్ర రాజయ్య యాదవ్ పాల్గొన్నారు.