యాదాద్రిలో రథసప్తమి వేడుకలు

  • సూర్యప్రభ వాహనంపై ఊరేగిన నర్సన్న

యాదగిరిగుట్ట: యాదాద్రిలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని సూర్యప్రభ వాహనం సేవపై ఆలయ తిరువీధుల్లో అర్చకులు ఊరేగించారు. అనంతరం ఆలయ తూర్పు గోపురం ముందు చతుర్వేద పారాయణం చేసి రథసప్తమి విశిష్టతను భక్తులకు తెలియజేశారు.