వరదల్లో చిక్కుకున్న భారత మహిళా క్రికెటర్.. కాపాడిన NDRF సిబ్బంది

వరదల్లో చిక్కుకున్న భారత మహిళా క్రికెటర్..  కాపాడిన NDRF సిబ్బంది

భారత మహిళా క్రికెటర్ రాధా యాదవ్ ఊహించని ప్రమాదంలో చిక్కుకుంది. ఆమె గుజరాత్ వరదల్లో చిక్కుకుపోయింది. రాధా యాదవ్ నివాసముంటున్న వడోదరా నగరాన్ని వరదలు ముంచేశాయి. చాలా ఏరియాల్లో ఉన్న ఇళ్లు, కార్లు, కార్యాలయాలు, ఇళ్ల సముహాలన్నీ నీట మునిగాయి.. దీంతో నగర జీవనం పూర్తిగా స్థంభించిపోయింది. ఇదే నగరంలో ఉన్న భారత మహిళా క్రికెటర్ రాధా యాదవ్ కూడా వరదల్లో చిక్కుకుపోయింది.

అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఆ నగరంలో ఏర్పడ్డాయి. వరదల సమయంలో తాను చికుక్కుపోయాయని.. ఆ సమయంలో కఠిన పరిస్థితులు ఎదర్కొన్నానని ఆమె తెలిపింది. అయితే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) కారణంగా ప్రాణాలతో బయటపడినట్టుగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియచేసింది. బరోడాకి చెందిన భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వడోదరాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరిస్థితికి చక్కబడేవరకు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలంటూ సోషల్ మీడియా ద్వారా కోరాడు.

రాధా యాదవ్ భారత మహిళా లెఫ్ట్ హ్యాండర్ స్పిన్నర్. కెరీర్ ప్రారంభంలో భారత్ తరపున అద్భుతంగా ఆడిన ఆమె.. ఆ తర్వాత క్రమంగా ఫామ్ దిగజారుతూ వచ్చింది. వన్డే, టెస్టులు పక్కనపెడితే ఆమె టీ20 ల్లో భారత రెగ్యులర్ ప్లేయర్. టీమిండియా తరుపున ఓ వన్డే, 55 టీ20 మ్యాచులు ఆడిన రాధా యాదవ్.. టీ20ల్లో 63 వికెట్లు పడగొట్టింది. అక్టోబర్ 3 నుంచి బంగ్లాదేశ్‌లో ప్రారంభమయ్యే ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి ప్రకటించిన జట్టులో రాధా యాదవ్‌కి కూడా చోటు దక్కింది.