శివ్వంపేట, వెలుగు: మండలంలోని చిన్న గొట్టిముక్కుల గ్రామంలో జడ్పీ హైస్కూల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీం అమలు తీరును శనివారం డీఈఓ రాధాకిషన్ పర్యవేక్షించారు. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని, డ్రాప్ అవుట్స్‌ను తగ్గించేందుకు ప్రవేశపెట్టిన ఈ స్కీంను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
విద్యార్థులందరూ బ్రేక్ ఫాస్ట్ చేసేలా చూడాలని టీచర్స్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బుచ్చా నాయక్, సర్పంచ్ బాలామణి, ఇంచార్జ్ హెచ్ఎం ఇందుమతి పాల్గొన్నారు.