- హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తల్లికి పరామర్శ
కరీంనగర్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఆదివారం జైలు పోలీస్ ఎస్కార్ట్ మధ్య కరీంనగర్ చేరుకున్నారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తన తల్లి సరోజినీ దేవిని చూసేందుకు అవకాశం కల్పిస్తూ నాంపల్లి కోర్టు శనివారం ఆయనకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
దీంతో ఆయనను పోలీస్ ఎస్కార్ట్ మధ్య ఉదయం 11 గంటలకు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. తన తల్లి సరోజినీ దేవి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు హాస్పిటల్ లోనే గడిపారు. తిరిగి పోలీసులు ఆయనను హైదరాబాద్ తరలించారు.