డార్లింగ్ ప్రభాస్... ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న రెండో ట్రైలర్ రానే వచ్చింది. ‘రాధేశ్యామ్’ మూవీకి సంబంధించి సెకండ్ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా మార్చి 11న విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ ను మూవీ టీం బుధవారం విడుదల చేసింది. వింటేజ్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మనం ఆలోచిస్తున్నామని భ్రమ పడుతుంటాం.. అన్న ప్రభస్ డైలాగ్‌తో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతోంది. ‘ ప్రేమకు విధికి మధ్య జరిగే యుద్ధమే’ అని ప్రిన్స్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ముగుస్తోంది.
ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడి పాత్రలో ప్రభాస్ లుక్ అదిరిందటున్నారు ఫ్యాన్స్. పూజా హేగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కీలక పాత్రలో జగపతిబాబు కూడా కనిపించనున్నారు. యువీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాయి. రెండో ట్రైలర్ కూడా రిలీజ్ కావడంతో సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు.