హైదరాబాద్: డార్లింగ్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ మూవీ నుంచి మరో అప్ డేట్ వచ్చింది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రేమ, విధిరాతకు మధ్య యుద్ధం అంటూ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘మళ్లీ లైఫ్ లో వాడి మొహం చూడను’ అని పూజ వాయిస్ తో మొదలైన ఈ వీడియో వినోదాత్మకంగా సాగింది. ‘కుక్ చేస్తావ్.. బాగా మాట్లాడతావ్.. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లెందుకు కాలేదు’ అంటూ పూజ చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మార్చి 11న విడుదల కానున్న రాధేశ్యామ్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు సినీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం: