‘రాధేశ్యామ్’ వాయిదా.. నిరాశలో డార్లింగ్ అభిమానులు

హైదరాబాద్: రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్. డార్లింగ్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీ ఆర్ఆర్ఆర్ బాట పట్టింది. సంక్రాంతి పండుగకు (జనవరి 14న) రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రాన్ని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రాధేశ్యామ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు గత కొన్ని వారాలుగా తీవ్రంగా శ్రమించామని.. కానీ ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో మూవీని వాయిదా వేయకతప్పడం లేదని యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. బిగ్ స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కు మరికొన్నాళ్లు ఎదురు చూపులు తప్పవని స్పష్టం చేసింది. 

‘ప్రేమ, విధికి మధ్య జరిగే సంఘర్షణే రాధేశ్యామ కథ. ఈ కఠిన పరిస్థితులను అధిగమించడానికి మీ (ప్రేక్షకులు) ప్రేమ తోడ్పడుతుందని నమ్ముతున్నాం. త్వరలో మిమ్మల్ని థియేటర్లలో కలుస్తాం’ అని రాధేశ్యామ్ మూవీ యూనిట్ పేర్కొంది. కాగా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీలో ఎల్లో అలర్ట్ విధించారు. నైట్ కర్ఫ్యూతోపాటు వీకెండ్ లాక్ డౌన్ కూడా విధించారు. ఢిల్లీలో థియేటర్లు కూడా మూతబడ్డాయి. ముంబైతోపాటు మరికొన్ని సిటీల్లో థియేటర్లలో ఆక్యుపెన్సీపై నిబంధనలు విధించారు. పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు విధించడం లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా పోస్ట్ పోన్ అయింది. దీంతో రాధేశ్యామ్ కూడా ఇదే బాట పట్టింది. సుమారుగా రూ.300 కోట్లతో భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజా హెగ్డే నటించింది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను జిల్ ఫేమ్ కె.రాధా కృష్ణ కుమార్ చేపట్టారు. సినిమాలో కీలకమైన పరమహంస పాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు నటించారు.  

మరిన్ని వార్తల కోసం: 

ఇద్దరు లేడీ డాక్టర్ల పెళ్లి.. కారణం అదే

ఐదు రోజుల్లో 8 మంది ఉగ్రవాదులు హతం

కాల్వలో కారును గుర్తించిన పోలీసులు