సేతుపతి సినిమాలో రాధిక ఆప్టే..

సేతుపతి సినిమాలో రాధిక ఆప్టే..

రొటీన్‌‌కు భిన్నంగా బోల్డ్ క్యారెక్టర్స్‌‌ చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది రాధిక ఆప్టే. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ, మారాఠీ చిత్రాల్లో నటించి పాన్ ఇండియా వైడ్‌‌గా మంచి గుర్తింపును అందుకుంది.  తాజాగా ఆమె ఓ క్రేజీ ప్రాజెక్టులో జాయిన్ కానుందని తెలుస్తోంది. పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలో  రాధిక ఆప్టేను సెలెక్ట్ చేశారట. 

ఇప్పటికే కీలక పాత్ర కోసం సీనియర్ నటి టబును ప్రకటించగా, మరో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్‌‌‌‌కు రాధికను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఆమె పాత్ర చాలా డిఫరెంట్‌‌గా ఉండబోతోందని, సినిమాకే స్పెషల్ అట్రాక్షన్‌‌గా నిలవనుందని టాక్.  త్వరలోనే తన పాత్రపై అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్ రానుంది.  పూరి కనెక్ట్స్‌‌ బ్యానర్‌‌‌‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్‌‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. త్వరలోనే ఇతర నటీనటులు టెక్నీషియన్స్‌‌ వివరాలను ప్రకటించనున్నారు.