బాలీవుడ్ బ్యూటీ నటి రాధికా ఆప్టే (Radhika Apte) త్వరలోనే తల్లి కాబోతున్నారు. బుధవారం (అక్టోబర్ 16న) BFI 2024 లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన లేటెస్ట్ మూవీ 'సిస్టర్ మిడ్‌నైట్' స్క్రీనింగ్ సందర్భంగా.. రాధిక అక్కడ రెడ్ కార్పెట్‌పై బేబీ బంప్తో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. రాధికా నవంబర్‌లో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు.
అయితే, రాధిక ఇంగ్లాండ్కు చెందిన మ్యూజిషియన్ బెనడిక్ట్ టేలర్ను 2012లో మ్యారేజ్ చేసుకున్నారు. ఆపై రాధికా సినీ కెరీర్ పీక్లో ఉండటంతో ఇంతకాలం పిల్లలు వద్దనుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్.
ఇకపోతే.. ప్రస్తుతం రాధికా ఆప్టే బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో 12 ఏళ్ల తర్వాత తల్లి కాబోతోంది అనే విషయం తెలియడంతో.. నెటిజన్లు, తోటి నటీనటులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read:-ఐకానిక్ టాలెంట్ చియాన్ సినీ స్పెషల్.. 34 ఏళ్ల వైవిధ్య ప్రయాణం
సిస్టర్ మిడ్‌నైట్ సినిమా విషయానికి వస్తే.. కరణ్ కంధారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 19న డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ కేన్స్‌లో ప్రదర్శించబడింది. 2024 కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రం రెండు విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది. అయితే, ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 20న విడుదల కానుంది.
తమిళనాడులో జన్మించిన రాధికా.. థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలెట్టారు. హిందీ, మరాఠి, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్ సినిమాల్లోనూ నటించారు.
తెలుగులో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'రక్తచరిత్ర’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత బాలకృష్ణకు జంటగా లెజెండ్, లయన్, కబాలి, విక్రమ్ వేద చిత్రాలతో పాటు కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రాధికా తెలుగులో డైరెక్ట్ సినిమా చేసి చాలా కాలం అవుతుందనే చెప్పాలి.