
- మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రాధికాఅరుణ్ కుమార్
హుజూర్ నగర్, వెలుగు : రైతుల మేలు కోసమే పనిచేస్తామని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రాధికాఅరుణ్ కుమార్ అన్నారు. గురువారం హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా రాధికాఅరుణ్ కుమార్, వైస్ చైర్ పర్సన్ గా ఆదూరి స్రవంతి కిశోర్ రెడ్డితోపాటు పాలకమండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సహకారంతో రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. రైతులకు మద్దతు ధర, గోదాం సౌకర్యాలను కల్పిస్తామన్నారు.
ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీధర్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు ముత్యాలంపాటి నాగుల్ మీరా, బత్తుల సైదిరెడ్డి, తోడేటి శ్రీనివాసరావు, మోదాల వెంకన్న, లచ్చిమల్ల నాగేశ్వరరావు, గజ్జల కొండారెడ్డి నట్టే జానకీరాములు, నందిపాటి కోటయ్య, భూక్య రాయసల్, చక్కెర వెంకటరెడ్డి, మట్టపల్లి వెంకటనారాయణ, గుండా శ్రీనివాసరావు, జవ్వాజి రామచంద్రయ్య, ద్వితీయశ్రేణి కార్యదర్శి గని, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.