![రక్తపు చుక్కే పట్టిస్తది: తుడిచేసినా.. తప్పించుకోలేరు](https://static.v6velugu.com/uploads/2020/03/blood.jpg)
మిస్టరీ కేసులను సాల్వ్ చేస్తున్న సూపర్ లైట్ టెక్నాలజీ
సాక్ష్యాలను తుడిచేసినా.. కంటికి కనిపించని అతి సూక్ష్మ కణాల గుర్తింపు
రాధిక హత్య కేసులో తండ్రిని పట్టించిన బనియన్
2016లో జర్మన్ టెక్నాలజీని కొన్న హైదరాబాద్ క్లూస్ టీమ్
హైదరాబాద్, వెలుగు: ఒకే ఒక్క రక్తపు బొట్టు నిందితులకు చెక్ పెడుతోంది. కంటికి కనిపించని అతి సూక్ష్మరేణువులను గుర్తిస్తూ మిస్టరీలను చేధిస్తోంది. సినీ ఫక్కీలో రేప్స్, మర్డర్స్ జరిగినా.. సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నం చేసినా ‘సూపర్ లైట్’ టెక్నాలజీ నేరస్తులను కటకటాల్లోకి పంపిస్తోంది. కరీంనగర్లో ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో తండ్రే నిందితుడని తేల్చడంలో ఈ జర్మన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. ఈ కేసులోనే కాదు.. గతంలో చాలా కేసుల్లో నేరస్తులను పట్టుకోవడంలో సూపర్‌లైట్ చాలా హెల్ప్ అయ్యింది.
తుడిచేసినా.. తప్పించుకోలేరు
మర్డర్స్, అత్యాచారాల కేసుల్లో నిందితులు సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు. అసలు వాటి ఆనవాలు లేకుండా చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో ‘సూపర్ లైట్’ సక్సెస్ అవుతోంది. క్లూస్ తో కేసులను సాల్వ్ చేస్తోంది. సంచలనం సృష్టించిన ‘దిశ’ అత్యాచారం, హత్య కేసుతోపాటు గత నెల 10న కరీంనగర్ లో జరిగిన ఇంటర్ స్టూడెంట్ రాధిక హత్య కేసులో నిందుతులను పట్టుకోవడంలో ఇది పోలీసులకు చాలా హెల్ప్ అయింది. రాధిక కేసులో సీన్ ఆఫ్ అఫెన్స్ లో సూపర్ లైట్ చేసిన బ్లూ స్టార్ స్కానింగ్ లో తండ్రి కొమురయ్య ఇన్వెస్టిగేషన్ ను తప్పుదారి పట్టించాడని తేల్చింది. కొమురయ్య వాడిన చెప్పులు, బనియన్, కత్తిపై కడిగేసిన రక్తపు మరకలను సూపర్ లైట్ సాయంతో గుర్తించిన స్పెషల్ క్లూస్ టీమ్ ఎఫ్ఎస్ఎల్ కి అప్పగించింది.
సూపర్ లైట్‌తో 4 గంటల పాటు చెకింగ్
రాధిక డెడ్ బాడీ ఉన్న పరిసరాల్లో అణువణువును క్లూస్ టీమ్ ‘సూపర్ లైట్’తో చెక్ చేసింది. రాధిక తండ్రి కొమురయ్య వాడిన చెప్పులు, బనియన్ తోపాటు కత్తిపై ఉన్న రక్తపు మరకలను అల్ట్రా వయోలెట్ లైట్సాయంతో గుర్తించింది. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ఆరుగురు సభ్యుల క్లూస్ టీమ్ కరీంనగర్ వెళ్లింది. సీన్ ఆఫ్ అఫెన్స్‌లో ల్యూమినల్ రెజెంట్ కెమికల్ రియాక్షన్ లో సూపర్ లైట్ ను ఈ టీమ్ వాడింది. ఇందులో రాధిక మెడను కత్తితో కోసే సమయంలో తండ్రి బనియన్ పై చిట్లిన రక్తపు చుక్కలను సూపర్ లైట్ గుర్తించింది. తెలుపు బనియన్ పై అల్ట్రా వయోలెట్ బ్లూ లైట్ లో కనిపించిన డార్క్ బ్లడ్ స్పాట్స్ ను ఎఫ్ఎస్ఎల్ నిపుణులకు పంపింది. కత్తి పిడి భాగంలోకి వెళ్లిన రక్త కణాలను కూడా గుర్తించింది. పరీక్షల తర్వాత కొమురయ్య బనియన్ పై ఉన్న బ్లడ్ రాధిక బ్లడ్ ఒకటే అని తేలడంతో కొమురయ్యే నిందితుడని పోలీసులు తేల్చారు.
2016లో సూపర్ లైట్ కొనుగోలు
ల్యుమోటిక్ జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన సూపర్ లైట్ ను 2016 లో హైదరాబాద్ క్లూస్ టీమ్ కొనుగోలు చేసింది. అల్ట్రా వయోలెట్ లైట్ పరిజ్ఞానంతో రూపొందించిన సూపర్ లైట్ 200 వాట్స్ వెలుతురులో సీన్ ఆఫ్ అఫెన్స్ ను పరిశీలిస్తుంది. అత్యంత డార్క్ రూమ్ లో కెమికల్ రెజెంట్ రియాక్షన్ తో పనిచేస్తుంది. బ్లూ స్టార్ విధానంలో కంటికి కనిపించని రక్తపు చుక్కలతోపాటు స్పెర్మ్, ఇతర సూక్ష్మ రేణువులను గుర్తిస్తుంది. ఈ క్లూస్‌తో ఎఫ్ఎస్ఎల్ చేసే టెస్టుల ద్వారా పోలీసులు నిందితులను గుర్తిస్తున్నారు.
దిశ కేసులోనూ కీ రోల్
దిశ అత్యాచారం, హత్య కేసులో కూడా సూపర్ లైట్ కీలక ఆధారాలు సేకరించింది. తొండుపల్లి టోల్ గేట్ సీన్ ఆఫ్ అఫెన్స్ తో పాటు డెడ్ బాడీ లభించిన చటాన్ పల్లి అండర్ బ్రిడ్జి వద్ద సూపర్ లైట్ తో క్లూస్ కలెక్ట్ చేశారు. నిందితులు వాడిన లారీ క్యాబిన్ నుంచి దిశ తల వెంట్రుకలు, లారీ సీట్ పై కడిగేసిన రక్తపు మరకలు, క్యాబిన్‌లోని చిన్నచిన్న ఇసుక రేణువులను సూపర్ లైట్ గుర్తించింది. వీటితో పాటు దిశ డెడ్ బాడీని దహనం చేసిన ప్రాంతంలో నిందితుల కాళ్ల నుంచి లారీ క్యాబిన్ లోకి వచ్చిన కంటికి కనిపించని గడ్డిని కూడా గుర్తించి ఎఫ్ఎస్ఎల్ కి అప్పగించింది.
పసికందు నరబలి కేసులోనూ..
రెండేండ్ల క్రితం ఉప్పల్ చిలుకానగర్ నరబలి కేసులో నిందితుడిని సూపర్ లైటే పట్టించింది. 2018 ఫిబ్రవరి 1న జరిగిన ఈ కేసులో పసికందు రక్తపు చుక్కలే నిందితుడు రాజశేఖర్‌ను పట్టించాయి. బండల మధ్యలో దొరికిన అత్యంత సూక్ష్మమైన పసికందు రక్తపు చుక్కలను సూపర్ లైట్ గుర్తించింది. తర్వాత రాజశేఖర్ ఇంట్లోనే నరబలి జరిగిందని తేలింది.
మంచి రిజల్ట్స్ వస్తున్నయ్
రాధిక హత్య కేసులో సీన్ ఆఫ్ అఫెన్స్ ను క్లూ స్ టీమ్ సూపర్ లైట్ తో గాలించింది. ఉతికిన ఆరేసిన కొమురయ్య బనియన్
దారపు పోగుల మధ్యలో బ్లడ్ స్పాట్స్ తోపాటు కత్తిపై ఉన్న బ్లడ్ ఆధారంగా మిస్టరీ వీడింది. సాక్ష్యాలను మాయం చేయాలనుకునే కేసు
ల్లో సూపర్ లైట్ మంచి ఫలితాలు ఇస్తోంది. – డాక్టర్ వెంకన్న, క్లూస్ టీమ్ హెచ్‌వోడీ, హైదరాబాద్
see also: ఫీజు వసూల్ చేసి.. ఇంటర్ బోర్డుకు కట్టని కాలేజీ