ప్రపంచ విద్యా వ్యవస్థలో భారత్ది 3వ స్థానం

వరంగల్ జిల్లా: విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు టీఆర్ఎస్ ఎంపీ, పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ కె. కేశవరావు. ప్రపంచ విద్యా వ్యవస్థలో భారతదేశం చైనా, యూఎస్ఏ  తరువాత మూడో స్థానంలో ఉందని ఆయన వెల్లడించారు. ఆదివారం కాకతీయ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజి పీవీ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో 'దేశంలో ఉన్నత విద్య- సవాళ్లు- పరిష్కార మార్గాలు' అనే అంశం పై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా హాజరయ్యారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని 137 కోట్ల జనాభాలో 31 మిలియన్ మంది స్టూడెంట్స్ మాత్రమే స్కూళ్లకు వెళ్తున్నారని తెలిపారు. ‘‘జ్ఞానమే సర్వోన్నతమైనదని అంటున్నాం కానీ అందుకు తగ్గట్టుగా విద్యా వ్యవస్థ లో మౌళిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. మన దగ్గర ఉన్నత విద్యను సమీక్షించడానికి కొఠారి కమిషన్ ఏర్పాటు చేశారు.. ద్యా వ్యవస్థ ఎలా ఉండాలో అందులో సమూలంగా పేర్కొన్నారు.. ఎడ్యుకేషన్ మీద ప్రేమ ఉన్న వాళ్లేవారైనా కొఠారి కమిషన్ సిఫారసులు చదవాలి.. రాజ్యాంగం చదవండని చెప్తున్న ప్రొఫెసర్ హరగోపాల్ కచ్చితంగా కొఠారి కమిషన్ సిఫార్సులు చదవాలి..జాతీయ విద్యా విధానంలో ఉండాల్సిన విలువలన్నింటినీ అందులో పొందుపరిచారు.. కేయూలో నాలెడ్జ్ సెంటర్ కోసం వైస్ ఛాన్స్ లర్ 3.5 కోట్లు అడిగారు, ఆ మొత్తాన్ని శాంక్షన్ చేస్తాం..’’ అని కె.కేశవరావు అన్నారు.
అందరికీ కామన్ ఎడ్యుకేషన్ ఇవ్వలేనప్పుడు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా పెడతారు: ప్రొఫెసర్ హరగోపాల్
అందరికీ కామన్ ఎడ్యుకేషన్ ఇవ్వలేక పోయినప్పుడు.. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎలా పెడుతున్నారని ప్రశ్నించారు ప్రొఫెసర్ హరగోపాల్. సెంట్రలైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టం సమర్థంగా ఉండాలన్నారు. దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ పటిష్టం కోసం రాధాకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేశారని, కమిషన్ సిఫార్సులో భాగంగానే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పడిందన్నారు. యూనివర్సిటీలకు నిధులు ఇచ్చి డెవలప్ చేయడం పై ఫోకస్ పెట్టడానికే ఏర్పాటు చేశారు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో యూనివర్సిటీ లకు  అటానమస్ కూడా ఇచ్చిందన్నారు. సొంతంగా ఆలోచించి, సమస్యలను విశ్లేషించి పరిష్కరించుకోవడం, వైఫల్యాలను బట్టి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు అటానమస్ యూనివర్సిటీలకు ఉంటుందన్నారు. కొన్ని పరిస్థితులు ఆ హక్కును హరిస్తున్నాయని,విద్యా వ్యవస్థ నూ ప్రభావితం చేస్తున్నాయన్నారు. ప్రస్తుత ఎడ్యుకేషన్ పాలసి కొన్ని రాజ్యాంగ విలువలను వదిలేసినట్టుందని, కొఠారి కమిషన్ ఎడ్యుకేషన్ సామాజిక అవసరాల గురించి, అవసరం లేని వాటి గురించి కుడా చెప్పిందన్నారు. 

 

ఇవి కూడా చదవండి

ప్రభుత్వం పేదల భూములు లాక్కుని ప్రైవేటు సంస్థలకు ఇస్తోంది

నకిలీ స్టికర్లతో తిరిగితే కఠిన చర్యలు

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్