Amur Falcon:రేడియో ట్యాగ్ ఫాల్కన్ పక్షి..ఆఫ్రికా నుంచి సైబీరియాకు..ఇండియాలో హాల్ట్

Amur Falcon:రేడియో ట్యాగ్ ఫాల్కన్  పక్షి..ఆఫ్రికా నుంచి సైబీరియాకు..ఇండియాలో హాల్ట్

అముర్ ఫాల్కన్ పక్షులు..పావురం సైజులో ఉండే ఈ పక్షులు ఖండాంతరాలు దాటి సుదీర్ఘ ప్రయాణం ఆశ్చర్యం కలిగిస్తుంది. వేటాడే పక్షులలో వేల కిలోమీటర్లు ప్రయాణించే ఈ రాప్టర్లు.. వేసవిలో ఆఫ్రికానుంచి సైబీరియాకు వలస పోతాయి. ఈశాన్య భారత దేశం వీటికి పిటిపాట్..అంతేకాదు విశ్రాంతి, ఆహారం కోసం కీలక ప్రదేశం. ఈ పక్షుల అద్బుతమైన సుదీర్ఘ వలస ప్రయాణం గురించి తెలుసుకునేందుకు భారత్ కు చెందిన పరిశోధకులు రెండు ఫాల్కన్ పక్షులకు ట్యాగ్ చేశారు. అవి తిరుగు ప్రయాణంలో మరో పదిరోజుల్లో ఇండియాకు చేరబోతున్నాయి.. వేలకిలోమీటర్లుప్రయాణించే ఈ ఫాల్కన్ పక్షుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. 

ప్రతియేటా వేలాది అముర్ ఫాల్కన్లు (ఫాల్కో అమురెన్సిస్) భారతదేశం గుండా ఖండాలను దాటుతూ అసాధారణ ప్రయాణం సాగిస్తాయి. ఈ పక్షుల సుదీర్ఘ వలప ప్రయాణం, వాటిని రక్షణను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(WII) 2018లో మణిపూర్ లో తమెంగ్ లాంగ్ ప్రాంతంలో ఉపగ్రహ ట్యాగింగ్ చేశారు. పక్షులను ట్యాగ్ చేయడం ద్వారా వాటి మార్గాలు, ప్రవర్తన, మనుగడ రేటును పరిశోధకులు పర్యవేక్షిస్తున్నారు. వలస పక్షులను రక్షించడంలో అంతర్జాతీయ సహకారం కోసం ఈ డేటా చాలా కీలకమైనది. 

అముర్ ఫాల్కన్ పక్షుల అద్భుత ప్రయాణం రష్యా ,ఈశాన్య చైనాలోని సుదూర తూర్పు ప్రాంతాలలో ఉన్న అముర్ ప్రాంతంలో ప్రారంభమవుతుంది. దాదాపు 22వేల కిలోమీటర్ల ప్రయాణం సాగించి  సైబీరియాకు  చేరుకుంటాయి. అవి వేసవిలో ఇక్కడ సంతానోత్పత్తి చేస్తాయి.చెట్ల కుహరాలలో గూడు కట్టుకుని కీటకాలను తింటాయి.సెప్టెంబర్ నాటికి ఉష్ణోగ్రతలు తగ్గడం ప్రారంభించినప్పుడు అవి దక్షిణం వైపు వలస వెళ్ళడం ప్రారంభించి  చైనా,భారతదేశం గుండా వేల కిలోమీటర్లు ఎగురుతాయి. తరువాత అరేబియా సముద్రం మీదుగా ఆఫ్రికా వైపు నిరంతరాయంగా ప్రయాణించడం ప్రారంభిస్తాయి. ఈ పక్షులు వేసవిలో బోట్స్వానా, నమీబియా ,దక్షిణాఫ్రికా వంటి దేశాలకు చేరుకుంటాయి. అక్కడ శీతాకాలం గడిపిన తర్వాత ఏప్రిల్ తర్వాత తిరుగు ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి. మరోసారి భారతదేశం గుండా వెళుతూ ఆసియాకు తిరిగి వెళ్తాయి.

ఇండియా హాల్ట్ స్పాట్..

భారతదేశంలో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్ ,మణిపూర్ లలో ఈ వలస పక్షులు బస చేస్తాయి. ఈ ప్రాంతాలు ఫాల్కన్లు విశ్రాంతి తీసుకోవడానికి ,ఆహారం తీసుకోవడానికి స్టాప్‌ఓవర్ పాయింట్లు అన్నమాట. ఫాల్కన్లు సముద్రంపై  దాదాపు 3 వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. ఆ సమయంలో తగిన శక్తికి ఆహారం కావాలి.. అవి భారత్ లోనే ఈ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. 

ఫాల్కన్లను ఎలా ట్రాక్ చేస్తారంటే..

2024నవంబర్ లో రెండు ఫాల్కన్ పక్షులకు ఉపగ్రహ ట్రాన్స్మిటర్లు అమర్చి విడిచిపెట్టారు. ఈ పక్షులకు - చియులువాన్2,గ్వాంగ్రామ్ అని పేరు పెట్టారు.  వలస పక్షులు విడిది సమయంలో చేరుకునే మణిపూర్‌లోని స్థానిక గ్రామాల పేర్లు ఇవి. అప్పటినుంచి ఈ ఫాల్కన్ పక్షులను పరిశోధకులు పరిశీలిస్తున్నారు. 
గత నవంబర్‌లో మణిపూర్‌లో రేడియో ట్యాగ్ చేయబడిన అముర్ ఫాల్కన్ దక్షిణ ఆఫ్రికాలో 114 రోజులు గడిపిన తర్వాత సైబీరియాకు తిరిగి వలస వెళ్లడం ప్రారంభించిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రస్తుతం చియులువాన్2 అనే మగ ఫాల్కన్ ఏప్రిల్ 8, 2025న బోట్స్వానా నుంచి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఏప్రిల్ మధ్య నాటికి అది దాదాపు 3వేల కిలోమీటర్లు ప్రయాణించి సోమాలియాకు చేరుకుంది. రాబోయే పది రోజుల్లో అది అరేబియా సముద్రం దాటి భారతదేశంలోకి ప్రవేశిస్తుందని భావిస్తున్నారు.