భారీ వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి

భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం/ జూలూరుపాడు, వెలుగు : భారీ వాహనాలైన ట్రాక్టర్లు, లారీలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అంతికించుకోవాలని ఎస్పీ బి.రోహిత్ రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలూరుపాడు , గుండెపుడి, పాపకొల్లు  గ్రామాలకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్లతో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ సమావేశం నిర్వహించారు. భద్రాచలం గోదావరి బ్రిడ్జి సమీపంలో  ఏఎస్పీ పంకజ్ పరితోష్​ వాహనదారులకు సీఐ నాగరాజురెడ్డితో కలిసి అవగాహన కల్పించారు. 

నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ట్రాక్టర్లను గుర్తించి స్వయంగా రేడియం స్టిక్కర్లు అంతికించారు. 15 రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్​ నిర్వహిస్తామని తెలిపారు. ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రేడియం స్టిక్కర్లు లేని వాహనదారులు ఆర్టీవో, ఎంవీఐ కార్యాలయాలకు వెళ్లి తీసుకోవాలని సూచించారు. లోడింగ్​ విషయంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.