
గద్వాల టౌన్, వెలుగు: గద్వాలలో ఆదివారం ఆర్ఏఎఫ్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. పట్టణంలోని మెయిన్ రోడ్ల గుండా ఈ ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలకు భరోసా కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ ఫ్లాగ్ మార్చ్‌లో ఆర్ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ నరేశ్‌కుమార్ కామ్లే తదితరులు ఉన్నారు.