రాఫెల్‌‌‌‌తో ‘హాల్‌‌‌‌’ బద్నామ్‌

ఏరోస్పేస్ రంగంలో ‘హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్’ది చాలా గొప్ప చరిత్ర. రాఫెల్ డీల్ నేపథ్యంలో యుద్ధ విమానాల తయారీ సంస్థ ‘హాల్’ ఇమేజ్ మాత్రం బాగా డ్యామేజ్ అయింది. ఏరో స్పేస్ రంగంతో ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు, రాజకీయవేత్తలు ఆరోపించినట్లు ‘హాల్’కి సమర్థత లేదంటే మాత్రం ఒప్పుకోనంటున్నారు ఆ సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌‌‌‌ సక్సేనా.

దేశ రాజకీయాల్లో దుమారాన్ని రాజేసిన రాఫెల్ డీల్ నేపథ్యంలో యుద్ధ విమానాల తయారీ సంస్థ ‘హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)’ ఇమేజ్ మాత్రం బాగా డ్యామేజ్ అయింది. రాఫెల్  కుంభకోణం నుంచి బయటపడటానికి ‘హాల్’పై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిందలు వేసిందన్న ఆరోపణలు పేపర్లలో చదివా. అనిల్ అంబానీ గ్రూపునకు చెందిన ‘రిలయన్స్ డిఫెన్స్’కి లాభం చేయడానికే …ఆ సంస్థను అఫ్‌ సెట్ భాగస్వామిగా కేంద్రం ఒత్తిడితో దసో ఏవియేషన్ ఎంపిక చేసిందన్న ఆరోపణలు చాలా వచ్చాయి. ఇక్కడో విషయం చెప్పాలి. మౌలికంగా నేను విమానాల తయారీ రంగానికి చెందిన వ్యక్తిని. రాజకీయాలతో సంబంధం లేనివాడిని. దీంతో ఈ ఆరోపణల్లో ని నిజానిజాలపై ఎలాంటి కామెంట్లు చేయలేను. అది నా వృత్తి కాదు. అయితే, ఏరో స్పేస్ రంగంతో ఎలాంటి పరిచయం లేని వ్యక్తులు, రాజకీయవేత్తలు ఆరోపించినట్లు ‘హాల్’కి సమర్థత లేదంటే మాత్రం నేను ఒప్పుకోను.

‘హాల్’ది ఘనమైన చరిత్ర
ఏరో స్పేస్ రంగంలో ‘హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్’ది చాలా గొప్ప చరిత్ర. ప్రపంచవ్యాప్తంగాగల టాప్–100 ఏరోస్పేస్ కంపెనీల్లో ‘హాల్’ ది 38వ ర్యాంకు. ఇదేమీ చిన్న విషయం కాదు. రాత్రికి రాత్రి ‘హాల్’ ఈ విజయాలను అందుకోలేదు. అసలు విమానాల తయారీయే చాలా పెద్ద ప్రాసెస్. అందులోనూ యుద్ధ విమానాలంటే చెప్పక్కర్లేదు. ఇలాంటి రంగంలో ‘హాల్’ తన మార్క్ వేసింది. జెట్‌‌‌‌ ఫైటర్ల తయారీలో అనుభవం ఉన్న వందలాది మంది ఇంజనీర్లు, ఎక్స్‌‌‌‌పర్ట్‌ ల కష్టం ఉంది. రక్షణ రంగంలో ఇండియా ఇవాళ్టి రోజున ఈ స్థాయి కి చేరిందంటే దాని వెనక ‘హాల్’ కృషిని ఎవరూ విస్మరించలేరు. తయారీ దశ మొదలుకుని , అప్‌‌‌‌గ్రేడేషన్ సహా అనేక దశలను దాటుకుని విమానం ఒక రూపాని కి వచ్చాక కూడా దాని సమర్థతపై ‘హాల్’ అనేక పరీక్షలు నిర్వహిస్తుంది. క్వాలిటీ కంట్రోల్‌‌‌‌కి టాప్ ప్రయారిటీ ఇస్తుంది. ‘మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవరాల్’ (ఎమ్మార్వో ) టెక్నాలజీని నూటికి నూరు శాతం వాడుకుంటుంది. అన్ని రకాలుగానూ ఓకే అనిపించుకున్నాకే ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’కి యుద్ధ విమానాన్ని అందచేస్తుంది. ఏరో స్పేస్ రంగంలో తనదైన మార్క్ వేసింది ‘హాల్’. ఇదంతా నేను ఎక్కడో పుస్తకాల్లో చదివి మీకు తెలియచేయడం లేదు. ‘హాల్’ సంస్థలో నేను పనిచేసిన అనుభవంతో చెబుతున్న మాట. ‘హాల్’ని ఈ స్థాయికి తీసుకురావడానికి అక్కడ పనిచేసే ప్రొఫెషనల్స్ ఎంతగా కష్టపడతారో, ఎంత కమిట్‌‌‌‌మెంట్‌‌‌‌తో పనిచేస్తారో నేను స్వయంగా చూశాను.

దసో ఏం చెప్పింది?
డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఏం చెప్పినా, యుద్ధ విమానాలు తయారు చేసే సామర్థ్యం ‘హాల్’కి ఉందని సాక్షాత్తూ దసో ఏవియేషన్ సంస్థే భరోసా వ్యక్తం చేసింది. ఆ సంగతి పెద్దగా ప్రచారానికి రాలేదు. రాఫెల్ ఒప్పందం ఫైనలైజ్ కావడానికి ముందు బెంగళూరులోని హాల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ని దసో ప్రతినిధులు సందర్శించారు. ‘ఇండియాతో రాఫెల్ విమానాల తయారీకి మా ఏకైక భాగస్వామి ‘హాల్’ మాత్రమే. ‘హాల్’తోకలిసి మేం పనిచేస్తున్నాం ’ అని 2013 జూలైలో దసో సంస్థ సీఈవో ఎరిక్ ట్రాపియర్ స్పష్టం చేశారు. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రెండు నెలల ముందు విమానాల తయారీపై దసో ఏవియేషన్ సంస్థతో పాటు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఓ ఒప్పందంకూడా చేసుకున్నాయి . దీని ప్రకారం రాఫెల్ విమానాల తయారీలో దాదాపు 70 శాతం ‘హాల్’ చేతిలోనే ఉంటుంది. అనిల్ అంబానీకి చెందిన సంస్థ కేవలం కొన్ని విడి భాగాలను మాత్రమే తయారు చేస్తుంది. ‘సుఖోయ్ 30 యుద్ధ విమానాలను తామే ముడిసరుకు స్థాయి నుంచి తయారు చేస్తున్నప్పుడు రాఫెల్ జెట్ ఫైటర్లను తయారు చేయలేమా!’ అని హాల్ ప్రశ్నించిం ది. దసో సంస్థకి చెందిన మిరేజ్ –2000ని ఇరవై ఏళ్లుగా తామే మెయింటైన్‌‌‌‌ చేస్తున్నామని పేర్కొంది. ఇంత చరిత్ర ఉన్న హాల్‌‌‌‌ సమర్థతపై కావాలని దుష్ప్రచారం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

‘రిలయన్స్ డిఫెన్స్’ ఏ విధంగా బెటర్?
దేశ రక్షణావసరాలకు సేవలందిస్తున్న ‘హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ’ కంటే అసలు డిఫెన్స్‌‌‌‌ ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ తయారీలో అనుభవంలేని అనిల్ అంబానీ సంస్థ ఏ విధంగా బెటర్ అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు బదులిచ్చిన దాఖలాలు లేవు.