Rafael Nadal: 22 గ్రాండ్ స్లామ్ వీరుడి కథ ముగిసింది: టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నాదల్

Rafael Nadal: 22 గ్రాండ్ స్లామ్ వీరుడి కథ ముగిసింది: టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నాదల్

టెన్నిస్ అభిమానులకు బిగ్ షాక్. 22 ఏళ్ళ గ్రాండ్ స్లామ్ వీరుడు రఫెల్ నాదల్ తన కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. నాదల్ గురువారం (అక్టోబర్ 10) అధికారికంగా తన రిటైర్మెంట్ ప్రకటించాడు. 2024 నవంబర్‌లో జరగబోయే డేవిస్ కప్ ఫైనల్ తర్వాత రిటైర్ కానున్నట్లు అతను వెల్లడించాడు. తన రిటైర్‌మెంట్‌ను ప్రకటిస్తూ నాదల్ 13 భాషల్లో అందరికీ చాలా ధన్యవాదాలు తెలిపాడు. చివరి రెండు సంవత్సరాలు తన కెరీర్ లో కష్టంగా గడిచాయని ఈ స్పెయిన్ బుల్ తెలిపాడు. 

2001లో నాదల్ 14 ఏళ్ళ వయసులో ప్రొఫెషనల్ టెన్నిస్ లోకి అడుగుపెట్టాడు. 2002 లో తొలి సారి ATP  విజయాన్ని నమోదు చేశాడు. నాదల్ తన కెరీర్ లో 22 గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ గెలిచాడు. వీటిలో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండు సార్లు.. వింబుల్డన్ రెండు సార్లు రెండు సార్లు నెగ్గాడు. నాలుగు యూఎస్ ఓపెన్ ట్రోఫీలను తన ఖాతాలో వేసుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ సింగిల్స్ లో గోల్డ్ మెడల్ గెలిచాడు. 2016 బ్రెజిల్ లో జరిగిన ఒలింపిక్స్ లో డబుల్స్ లో గోల్డ్ మెడల్ అందుకున్నాడు. 

Also Read:-బ్యాటింగే కాదు ఫీల్డింగ్ కూడా రాదు

ప్రతిష్టాత్మక డేవిస్ కప్ ను 2004, 2009, 2011,2019 లో స్పెయిన్ కు అందించాడు. ఓవర్ల గా నాదల్ తన కెరీర్ లో 92 ATP టైటిల్స్ గెలిచాడు. వీటిలో పాటు 36 మాస్టర్ 1000 టైటిల్స్ ఉన్నాయి. మెన్స్ సింగిల్స్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ గెలిచిన రెండో ఆటగాడిగా నాదల్ తన కెరీర్ ను ముగించాడు. 2022 లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తర్వాత నాదల్ కు కష్టాలు మొదలయ్యాయి. 2023, 2024 లో గాయాలతో మెగా టోర్నీలకు దూరమయ్యాడు. ముఖ్యంగా తనకు కలిసి వచ్చిన ఫ్రెంచ్ ఓపెన్ లో 2024 తొలి రౌండ్ లోనే ఓడిపోవడంతో ఈ స్పెయిన్ స్టార్ తన కెరీర్ కు వీడ్కోలు చెప్పేశాడు.