ఒలింపిక్స్లో నడాల్‌‌‌‌ బోణీ

ఒలింపిక్స్లో  నడాల్‌‌‌‌ బోణీ

పారిస్‌‌‌‌: ఆఖరి నిమిషంలో బరిలోకి దిగిన స్పెయిన్‌‌‌‌ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ రఫెల్‌‌‌‌ నడాల్‌‌‌‌.. ఒలింపిక్స్‌‌‌‌ సింగిల్స్‌‌లో బోణీ చేశాడు. ఆదివారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో నడాల్‌‌‌‌ 6–1, 4–6, 6–4తో మార్టన్‌‌‌‌ ఫుక్సోవిచ్‌‌‌‌ (హంగేరి)పై గెలిచాడు. 

గాయంతో చాలా రోజుల నుంచి ఆటకు దూరంగా ఉన్న నడాల్‌‌‌‌.. రోలాండ్‌‌‌‌ గారోస్‌‌‌‌లోకి అడుగుపెట్టగానే ఫ్యాన్స్‌‌‌‌ స్టాండింగ్‌‌‌‌ ఒవేషన్‌‌‌‌ ఇచ్చారు. రెండో రౌండ్‌‌‌‌లో నడాల్‌‌‌‌.. సెర్బియా సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌ నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌తో తలపడనున్నాడు. ఇద్దరి మధ్య ఇది 60వ మ్యాచ్‌‌‌‌ కావడం విశేషం. ఓపెన్‌‌‌‌ ఎరా (1968)లో ఇద్దరు ప్లేయర్లు పరస్పరం ఎక్కువ తలపడటం ఇదే మొదటిది. నడాల్‌‌‌‌తో ముఖాముఖి రికార్డులో జొకో 30–29తో ముందంజలో ఉన్నాడు.