వరంగల్లో రాజుకున్న ఫ్లెక్సీల రాజకీయం

వరంగల్ నగరంలో ఫ్లెక్సీల రాజకీయం రాజుకుంది. ఇవాళ సాయంత్రం జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో మోడీ, బండి సంజయ్ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే మున్సిపల్ సిబ్బంది బీజేపీ ఫ్లెక్సీలను తొలగించింది. దీంతో గందరగోళం చోటు చేసుకుంది. బీజేపీ నేతలకు మున్సిపల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. అధికార పార్టీ నేతలే మున్సిపల్ సిబ్బందితో ఫ్లెక్సీలు తీపిస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.