విదేశాల్లోని ‘రేజ్ రూమ్ ’ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ తొలిసారిగా సిటీలో..

విదేశాల్లోని ‘రేజ్ రూమ్ ’ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ తొలిసారిగా సిటీలో..
  • మాదాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అయ్యప్ప సొసైటీలో ఏర్పాటు సిటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్

హైదరాబాద్, వెలుగు : ఒత్తిడి ఎక్కువైనా, చిరాకులో ఉన్నా..  చేతికి దొరికిన దాన్ని నేలకేసి కొట్టాలని అనిపిస్తుంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌లో ఫోన్లు, టీవీ రిమోట్లు, గ్లాస్‌‌‌‌‌‌‌‌లు, ఇతర వస్తువులు పగలగొట్టేవారు చాలామందే ఉంటారు. తీరా అవి పాడైపోయాక అనవసరంగా పగులగొట్టామేమోనని బాధపడుతుంటారు. కోపం ఎక్కువైనా.. ఎవరి మీద చూపించాలో తెలియక వస్తువులను పగులగొట్టేస్తుంటారు. ఇలాంటి ఫ్రస్ట్రేషన్ నుంచి రిలీఫ్ పొందేందుకు అమెరికా, బ్రిటన్ ​లాంటి దేశాల్లో అయితే సామాన్లను పగులగొట్టే థీమ్ రూమ్‌‌‌‌‌‌‌‌లు అందుబాటులో ఉన్నాయి. జనాలు వీటిలోకి వెళ్లి వస్తువులను పగలగొడుతూ ఒత్తిడి నుంచి బయటపడుతుంటారు. ఇప్పుడు ఇలాంటిదే ‘రేజ్ రూమ్’ పేరుతో సిటీలోనూ అందుబాటులోకి వచ్చింది. రేజ్ రూమ్​లోని సామాన్లను పగులగొట్టి ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందవచ్చు. కాగా ఈ రూమ్​కు సిటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్​ వస్తోంది. ముఖ్యంగా యువత తమ ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌తో వెళ్లి వస్తువులు పగులగొట్టి ఫ్రస్టేషన్​ను తీర్చుకుంటోంది.

డిఫరెంట్ కాన్సెప్ట్..

వివిధ రకాల కారణాలతో ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురయ్యే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఉద్యోగులు,  స్టూడెంట్లు, గృహిణులు, ఇంట్లో ఉండే పెద్దవాళ్లు ఎవరూ దీనికి మినహాయింపు కాదు. ఈ ఒత్తిడిని ఎలా పోగొట్టుకోవాలో తెలియక .. కోపమొస్తే ఫోన్, ఇతర వస్తువులు పగులగొట్టడం కామన్ అయిపోయింది. ఇందులో నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్ బాట పట్టినవాళ్లూ ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి ఈ రేజ్​రూమ్‌‌‌‌‌‌‌‌  మంచి రిలాక్సేషన్ ఇస్తోంది. ఒంటరిగా రిలీఫ్ పొందాలనుకునేవారికి కూడా ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. నలుగురైదుగురు కలిసి వెళ్లేందుకు కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

రూ.800 నుంచి మొదలు

సిటీకి చెందిన సూరజ్ పూసర్ల ఈ రేజ్​రూమ్‌‌‌‌‌‌‌‌ల కాన్సెప్ట్​ను గ్రేటర్​లో తొలిసారిగా పరిచయం చేశాడు. ఈ ఏడాది అక్టోబర్​లో మాదాపూర్​లోని అయ్యప్ప సొసైటీలో దీన్ని ప్రారంభించాడు. కోపం, చిరాకును పోగొట్టుకోవడంతో పాటు ఫన్ కూడా పొందేలా ఏర్పాట్లు చేశాడు. ఒకేసారి ఏడుగురు లోపలికి వెళ్లి సామాన్లు పగులగొట్టొచ్చు. ప్యాకేజ్​ను బట్టి సామాన్ల సంఖ్య ఉంటుంది. 20 నిమిషాల టైమ్ ఉంటుంది. వస్తువులు పగులగొట్టే టైమ్​లో అవి తగలకుండా ఉండేందుకు హెల్మెట్‌‌‌‌‌‌‌‌, షూస్, గ్లౌజ్‌‌‌‌‌‌‌‌లు, బట్టలు ఇస్తారు. ప్రస్తుతం 4 రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజీని బట్టి రూ.800 నుంచి రూ.2800 ఛార్జ్ చేస్తున్నారు.   

ఫుల్ రెస్పాన్స్ 

చిన్నప్పుడే కాదు ఇప్పటికీ కోపమొస్తే ఏదో ఒకటి పగులగొడతాం. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ ​నుంచి పూర్తిగా బయటపడలేం. సామాన్లు పగులగొట్టి ఫన్ పొందవచ్చని అనిపించింది. అందుకే ఈ రేజ్​ రూమ్ స్టార్ట్ చేశా. విదేశాల్లో ఇదివరకే ఈ కాన్సెప్ట్ ఉన్నట్లు తెలుసుకున్నా. ఇప్పుడు మంచి రెస్పాన్స్​ వస్తోంది. - సూరజ్ పూసర్ల, ఓనర్, రేజ్ రూమ్, మాదాపూర్‌‌‌‌‌‌‌‌ 

ఫ్రస్ట్రేషన్ పోయింది

రేజ్ రూమ్ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఫ్రస్ట్రేషన్ పోగొట్టుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్. ఇందులో ఫన్ కూడా ఉంటుంది. వీకెండ్స్, హాలీడేస్​లో వెళ్లి ఎంజాయ్​చేయొచ్చు. - చోటు, మధురానగర్ 

మంచి రిలీఫ్..

కోపంతో వస్తువులను పగులగొట్టడం అనేది కామన్ అయిపోయింది. ఈ రేజ్ రూమ్‌‌‌‌‌‌‌‌ నిజంగా మంచి రిలీఫ్​ను ఇచ్చింది. ఇక్కడ చాలా టైమ్ స్పెండ్ చేశాం. - కృష్ణ, బోరబండ