టిక్‌టాక్‌పై నిషేధం.. కాంగ్రెస్‌ సభ్యుని కార్యాలయానికి నిప్పు

టిక్‌టాక్‌పై నిషేధం.. కాంగ్రెస్‌ సభ్యుని కార్యాలయానికి నిప్పు

ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధించడం.. ఆ నిషేధం అమల్లోకి రాకముందే గడువును పొడిగించడం చకచకా జరిగీపోయాయి. టిక్‌టాక్‌ కంపెనీలో కనీసం 50 శాతం వాటా అమెరికన్ల చేతిలో ఉంటే సేవలను పునురుద్ధరించనున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో.. సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, ట్రంప్ ప్రభుత్వం టిక్‌టాక్‌పై నిషేధ గడువును పొడిగిస్తామని ప్రకటన చేయకముందే అమెరికాలో అలజడి రేపెలా ఓ చిన్న ఘటన చేసుకుంది.

టిక్‌టాక్‌పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఓ యువకుడు విస్కాన్సిన్ రిపబ్లికన్ ప్రతినిధి గ్లెన్ గ్రోత్‌మాన్ జిల్లా కార్యాలయానికి నిప్పు పెట్టాడు. దాంతో, కార్యాలయంలోని ఫర్నిచర్ కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి మంటలను అదుపు చేశారు. అమెరికా కాలమానం ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సదరు యువకుడిని అరెస్టు చేసి.. అతనిపై పలు అభియోగాలు మోపినట్లు విస్కాన్సిన్ పోలీసులు పేర్కొన్నారు. 

Also Read : టిక్ టాక్లో అమెరికా పెట్టుబడులు

రాత్రివేళ కావడం.. అగ్నిప్రమాదం సమయంలో ఎవరూ ఆ భవనంలో లేకపోవడంతో ఎవరికీ గాయాలు కాలేదని విస్కాన్సిన్ భద్రతా చీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. టువంటి హింసాత్మక చర్యలను ఏమాత్రం సహించబోమని వెల్లడించారు.