
పాలమూరు, వెలుగు: మహబూబ్నగర్పట్టణంలోని గవర్నమెంట్ మెడికల్కాలేజీలో ర్యాగింగ్జరిగిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. 2023– 24 సంవత్సరానికి కాలేజీలో కొత్తగా చేరిన స్టూడెంట్స్హాస్టల్ వెళ్లే క్రమంలో సీనియర్ స్టూడెంట్స్అడ్డగించి ర్యాగింగ్ చేశారు. దీంతో వారు కాలేజీ డైరెక్టర్ రమేశ్ కు ఫిర్యాదు చేశారు. ఆయన ర్యాగింగ్ కు పాల్పడిన పదిమంది స్టూడెంట్స్ను వారి తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సెలింగ్ నిర్వహించి సస్పెండ్ చేసినట్లు కాలేజీ డైరెక్టర్ తెలిపారు.