కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఓ తెలుగు దర్శకుడితో చేతులు కలిపాడు లారెన్స్. రమేష్ వర్మ దర్శకత్వంలో ఆయన నటించనున్నట్టు శనివారం ప్రకటించారు. లారెన్స్‌కి ఇది 25 సినిమా. ఎ స్టూడియోస్ ఎల్‌ఎల్‌పి, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో షాడో అవతార్‌లో కనిపిస్తున్న లారెన్స్ ఇమేజ్ ఆసక్తి రేపుతోంది. నవంబర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని, ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.