RaghavaLawrence: బుల్లెట్ బండి ఎక్కిన కాల భైరవ.. అంచనాలు పెంచిన లారెన్స్ కొత్త చిత్రాల అప్‌‌డేట్స్‌

RaghavaLawrence: బుల్లెట్ బండి ఎక్కిన కాల భైరవ.. అంచనాలు పెంచిన లారెన్స్ కొత్త చిత్రాల అప్‌‌డేట్స్‌

కొరియోగ్రాఫర్‌‌‌‌గా, దర్శకుడిగా, నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence). ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మంగళవారం (అక్టోబర్ 29న) ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా తన కొత్త చిత్రాలకు సంబంధించిన అప్‌‌డేట్స్‌‌ను ప్రకటించారు మేకర్స్.

‘బుల్లెట్ బండి’ టైటిల్‌‌తో ఓ యాక్షన్ అడ్వంచరస్ మూవీని ప్రకటించారు. ఇన్నాసి పాండియన్ దర్శకత్వంలో కతిరేసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనౌన్స్‌‌మెంట్‌‌తో పాటు లారెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌, గ్లింప్స్‌ ను రిలీజ్ చేశారు.స్టైలిష్​  పోలీస్ క్యారెక్టర్‌‌‌‌లో తనను ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంది.ఇందులో సునీల్ కీలక పాత్ర పోషిస్తుండగా, సామ్ సీ ఎస్ సంగీతం అందిస్తున్నాడు.

మరోవైపు లారెన్స్ హీరోగా రమేష్​ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘కాల భైరవ’ అనే టైటిల్‌‌ను ప్రకటించారు. ఇది సూపర్ హీరో ఫిల్మ్ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌లో లారెన్స్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తనకు ఇది 25వ సినిమా. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. న‌‌వంబ‌‌ర్‌‌లో షూటింగ్‌‌ను ప్రారంభించి వచ్చే ఏడాది స‌‌మ్మర్‌‌లో సినిమా విడుద‌‌ల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు.