
కొరియోగ్రాఫర్‌గా, నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన సత్తా చాటుకున్నాడు రాఘవ లారెన్స్. ముఖ్యంగా ‘కాంచన’ సిరీస్‌తో డైరెక్టర్‌గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటికే మూడు భాగాలను రూపొందించి సక్సెస్‌ను అందుకున్నాడు. తాజాగా ‘కాంచన 4’ చిత్రం గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించనుందనే న్యూస్ వైరల్ అవుతోంది.
దీనిపై లారెన్స్ రియాక్ట్ అయ్యాడు. ‘కాంచన 4’కు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు రూమర్స్ మాత్రమే. ఈ చిత్రంలోని నటీనటులను మా నిర్మాణ సంస్థ రాఘవ ప్రొడక్షన్స్ నుంచి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం’ అని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ‘కాంచన 4’ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.