KaalaBhairava: రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో రాఘవ లారెన్స్ పాన్ ఇండియా సూపర్ హీరో ఫిల్మ్.. డైరెక్టర్ ఎవరంటే?

KaalaBhairava: రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో రాఘవ లారెన్స్ పాన్ ఇండియా సూపర్ హీరో ఫిల్మ్.. డైరెక్టర్ ఎవరంటే?

కోలీవుడ్‌‌తో పాటు టాలీవుడ్‌‌లోనూ మంచి మార్కెట్ ఉన్న హీరో రాఘవ లారెన్స్‌‌.  తను హీరోగా నటించిన ప్రతి తమిళ చిత్రం తెలుగులోనూ విడుదల అవుతోంది. అతను తెలుగులో స్ట్రయిట్ సినిమా చేసి మాత్రం చాలా కాలమైంది. అయితే త్వరలోనే లారెన్స్‌‌ ఓ తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

ఆయన ప్రస్తుతం తన కెరీర్లోని 25వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు మేకర్స్ 'కాల భైరవ ' అనే టైటిల్ పెట్టారు. ఇవాళ లారెన్స్ బర్త్ డే సందర్భంగా.. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను షేర్ చేశారు. పాన్‌ ఇండియా సూపర్‌హీరో చిత్రంగా వస్తోన్న 'కాల భైరవ' పోస్టర్ ఇంటెన్స్ గా ఉంది. లారెన్స్ గంభీరమైన లుక్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ పైగా మారింది.  

ALSO READ | SSMB29: వేటకు సిద్దమైన డైరెక్టర్ రాజమౌళి.. ఆసక్తికరమైన ఫొటో షేర్‌ చేస్తూ మహేష్ మూవీ అప్డేట్!

ఇకపోతే.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ యాక్షన్ అడ్వెంచర్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. కాగా ఈ మూవీ షూటింగ్ నవంబర్ 2024లో షురూ చేసి 2025 వేసవిలో గ్రాండ్ రిలీజ్‌ కానుంది. రాక్షసుడు, ఖిలాడి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను డైరెక్ట్ చేసిన రమేష్ వర్మ ఈ ప్రాజెక్ట్‌ని ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కించునట్లు తెలుస్తోంది. కాలభైరవ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ, మనీష్ షా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.