Raghava Lawrence Video: గ్రేట్ అన్న..మంచిని పెంచుతోన్న లారెన్స్ సాయం..ప్రతిఒక్కరికీ స్ఫూర్తినిచ్చే వీడియో

Raghava Lawrence Video: గ్రేట్ అన్న..మంచిని పెంచుతోన్న లారెన్స్ సాయం..ప్రతిఒక్కరికీ స్ఫూర్తినిచ్చే వీడియో

కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్(Raghava Lawrence) క్రేజే వేరు. సాయం చేయడంలో ఎప్పుడు ముందుండే లారెన్స్కు సినీ ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన సినిమాలు వస్తే ఫ్యాన్స్కి పండగే. ఏ హీరోకు చేయని వేడుకలు చేస్తారు. ఆపదలో ఆదుకోవడానికి ఎప్పుడు ముందుండే లారెన్స్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఈ సారి తాను చేసిన మంచి..పెరిగి పెద్దదైతే కలిగే ఆ గర్వకారణమైన క్షణాలు పొందుతూ ఆదర్శంగా నిలిచాడు.

తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నాటి నుంచి..నిర్విరామంగా చేస్తూ వస్తున్న సామాజిక సేవ ఎల్లలు దాటుతూ వస్తోంది. శ్యామ్ అనే కుర్రాడి చిన్నప్పటి నుంచి..ఇపుడు పెరిగి పెద్దై చదువుల వరకు ఆలనా పాలనా  లారెన్స్ చూస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం అతను ఓ ప్రముఖ కాలేజీలో చదువుతూనే..పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అలాగే హెబ్సికా అనే మరో బాలికకు కూడా లారెన్స్ సాయం చేస్తూ వస్తున్నాడు.

ఇక ఇప్పుడు శ్యామ్ అనే కుర్రాడు హెబ్సికా చదువుకు సంబంధించిన ఈ ఏడాది ఫీజును చెల్లించాడు.ఇదే విషయాన్నీ తాజాగా రాఘవ లారెన్స్ ట్విట్టర్ X ద్వారా ఓ వీడియో షేర్ చేస్తూ..తనదైన శైలిలో స్పందించాడు. లారెన్స్ మాటల్లో..

 

"హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్, నేను నాటిన విత్తనం ఇప్పుడు ఉదారమైన అబ్బాయిగా ఎదిగింది. అతను శ్యామ్, ప్రస్తుతం కాలేజీలో 3వ సంవత్సరం చదువుతూ పార్ట్‌టైమ్ జాబ్‌లో కూడా పనిచేస్తున్నాడు. 10 సంవత్సరాల నుండి నేను హెప్సిబా చదువు కోసం ఆమెకు మద్దతు ఇస్తున్నాను. రాయపురంకి చెందిన ఈమె చిన్నప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే చూసుకుంటుంది. ఇప్పుడు, హెప్సిబా కోసం శ్యామ్ ఈ సంవత్సరం స్కూల్ ఫీజు చెల్లిస్తున్నాడు. ఎంతో గర్వంగా అనిపించే ఈ సంతోషకరమైన క్షణాన్ని..మీ అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. శ్యామ్ సేవా యాత్రకు మీ అందరి ఆశీస్సులు కావాలి" అంటూ రాఘవ లారెన్స్ ట్వీట్ చేస్తూ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.