రఘువంశీ చేతికి పీఎంసీ గ్రూపు

రఘువంశీ చేతికి పీఎంసీ గ్రూపు

హైదరాబాద్​, వెలుగు: బోయింగ్, జీఈ  ఏవియేషన్, హనీవెల్, రోల్స్ రాయిస్, కాలిన్స్ ఏరోస్పేస్ వంటి గ్లోబల్ ఏవియేషన్​ కంపెనీలకు హై ప్రెసిషన్  హై-క్రిటికల్ భాగాలు, సబ్-అసెంబ్లీల వంటివి అందజేసే హైదరాబాద్ ​ఏవియేషన్​ కంపెనీ రఘువంశీ యూకే -ఆధారిత ప్రెసిషన్ మ్యాచింగ్ కంపెనీ అయిన పీఎంసీ గ్రూప్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేసింది. 

దీనివల్ల తమ వ్యాపార అవకాశాలు పెరుగుతాయని, పీఎంసీ గ్రూప్ నైపుణ్యాలు తమకు ఎంతో ఉపయోగపడుతాయని రఘువంశీ ఎండీ వంశీ వికాస్​ అన్నారు. ఈ కొనుగోలు వల్ల గ్లోబల్ ఫుట్‌‌‌‌‌‌‌‌ప్రింట్‌‌‌‌‌‌‌‌ను విస్తరించడం సాధ్యమవుతుందని చెప్పారు. తమ పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియో  సంప్రదాయ ఏరోస్పేస్,  డిఫెన్స్‌‌‌‌‌‌‌‌కు మించి వృద్ధి చెందుతుందన్నారు. యూరోపియన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లలోకి ప్రవేశించడం ద్వారా చమురు, గ్యాస్ రంగాలకూ సేవలు అందిస్తామని వంశీ వివరించారు.