హైదరాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామ మాజీ సర్పంచ్ లావణ్య గౌడ్ ఆత్మహత్యాయత్నంపై బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. నిధులు రాక అప్పుల బాధతో మహిళా సర్పంచ్ ఆత్మహత్యయత్నం చేసిందని తెలిపారు.
మహిళా బిల్లు పేరిట మహిళలపై కపట ప్రేమ చూపించే ఎమ్మెల్సీ కవితకు ఇవి కనిపించవా అని నిలదీశారు.రాష్ట్ర ప్రభుత్వానికి మహిళల పట్ల ఎందుకింత వివక్ష అని ప్రశ్నించారు. దీనిపై స్మితాఅగర్వల్, మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునీత రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. వెలుగులో పబ్లిష్ అయిన కథనాన్ని రఘునందన్ తన ట్వీట్ కు జతచేశారు.