ఆశా వర్కర్లపై ప్రభుత్వం చిన్న చూపు: రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు:   ఆశా వర్కర్లపై కేసీఆర్​ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని  ఎమ్మెల్యే మాదవనేని రఘునందన్​రావు ఆరోపించారు. శనివారం దుబ్బాకలో ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మెకు ఎమ్మెల్యే  మద్దతు తెలిపారు.  రాష్ట్రమొస్తే ప్రజల జీవితాలు బాగు పడుతాయనుకుంటే కేసీఆర్​ కుటుంబం మాత్రమే బాగు పడిందన్నారు.  మూడు నెలల కాలంలో ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమని విమర్శించారు. 

 సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఆశాలు కలిసి కట్టుగా ఉద్యమం చేయాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల, మున్సిపాల్టీ అధ్యక్షులు అరిగె కృష్ణ, కిష్టమ్మగారి సుభాష్​ రెడ్డి, నాయకులు భిక్షపతి, వీభీషణ్​ రెడ్డి, మాధవనేని భాను, ఆశాలు భాగ్య లక్ష్మి, మంజుల, శ్యామల, వసంత, శారద తదితరులు పాల్గొన్నారు.