
దుబ్బాక, వెలుగు: బీఆర్ఎస్ నాయకుల దగ్గర డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటెయ్యాలని ఆ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేటలోని కోమటి చెరువు సుందరీకరణకు కేటాయించిన రూ. 150 కోట్లను దుబ్బాక నియోజకవర్గానికి కేటాయిస్తే ప్రతి గ్రామం నందనవనంగా మారేదన్నారు. రఘునందన్ గెలిస్తేనే ఫించన్లు, సీసీ రోడ్లు, డబుల్ బెడ్రూమ్లు వస్తాయన్నారు.
దుబ్బాకలో మధ్యలోనే ఆగిపోయిన వంద పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చామని, కొత్త బస్టాండ్‌ను నిర్మించామన్నారు. దుబ్బాకలో గుండా రాజ్యం నడుస్తోందని, ఈ గుండా రాజ్యం పోవాలంటే బీజేపీని ఆదరించాలని కోరారు. పువ్వు గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని కోరారు.