
దుబ్బాక, వెలుగు : ఎవరెన్నీ కుట్రలు, కుతంత్రాలు చేసిన రానున్న ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో ఎగిరేది బీజేపీ జెండానేనని ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పష్టం చేశారు. గురువారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్వీ దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు సుచిత్గౌడ్ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన దుబ్బాక మండలం గోసాన్‌పల్లి గ్రామానికి చెందిన అంబటి శివ ప్రసాద్‌గౌడ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం పని చేసే బీజేపీ సైనికులు నియోజకవర్గంలో పుష్కలంగా ఉన్నారన్నారు. బీజేపీ గెలిచిన తర్వాతనే నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని, లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉండేదన్నారు. అధికార పార్టీ నాయకుల ఒంటేద్దు పోకడలు నచ్చకనే బీజేపీలో చేరడానికి క్యూ కడుతున్నారని తెలిపారు. అనంతరం రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యేకు మహిళలు రాఖీలు కట్టారు. ఆ తర్వాత పద్మశాలి సంఘం సమక్షంలో పట్టణంలో నిర్వహించిన శివ భక్త మార్కాండేయ స్వామి శోభా యాత్రలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేశారు. ఆయన వెంట బీజేపీ నాయకులు మట్ట మల్లారెడ్డి, మచ్చ శ్రీనివాస్, పుట్ట వంశీ, సుంకు ప్రవీణ్, రమేశ్ రెడ్డి, భద్రి ఉన్నారు.