హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడిని నేనే.. కేసీఆర్ ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయరు. దుబ్బాక ఎన్నికల్లో నా ఫోన్, నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేశారు..వారిపై చర్యలు తీసుకోవాలని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డీజీపికి ఫిర్యాదు చేశారు.
దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అరెస్ట్ అయిన డిఎస్పీ చెప్పారని మీడియాలో వచ్చింది.. అప్పుడే నేను డీజీపికి ఫిర్యాదు చేశానని రఘునందన్ రావు అన్నారు. నేను అనుమానించినట్లుగానే నా ఫోన్, నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేశారని రుజువైంది. ఈ కేసులో మొదటి ముద్దాయిగా కేసీఆర్, రెండో ముద్దాయిగా హరీష్ రావు, మూడో ముద్దాయిగా అప్పటి మెదక్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని చేర్చి.. ఇప్పటికైనా నిష్పక్ష పాతంగా విచారణ చేయాలని సీఎంరేవంత్ రెడ్డికి, చీఫ్ జస్టిస్ కు విజ్ణప్తి చేస్తున్నానని రఘునందన్ రావు అన్నారు.
గతంలో బేగంపేట్ కోటి రూపాయలు పట్టుబడ్డ కేసులో ప్రస్తుత ఎమ్మెల్యేలు రాజ్ గోపాల్ రెడ్డి, వివేక్ వెంకట్ స్వామిలు కూడా బాధితులే.. ఆకేసు కూడా ముందుకు పోలేదు. వారు కూడా ఫిర్యాదు చేయాలని విజ్ణప్తి చేస్తున్నా అన్నారు రఘునందన్ రావు. అప్పటి డీజపీ, ట్యాపింగ్ పరికరం కొన్న డీఎస్పీ , పీఏ, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు లను విచారణ చేసి బాధ్యుతలను అరెస్ట్ చేస్తారని నమ్ముతున్నా అని రఘునందన్ రావు అన్నారు.
ALSO READ | ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయం
కోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా విన్నారని చంద్రబాబు కూడా చెప్పారు.. సీజేఐకి ఫిర్యాదు చేయాలని న్యాయమూర్తులను కోరుతున్నానని అన్నారు రఘునందన్ రావు. కర్ణాటక, ఆంధ్రలోని రాజకీయ నాయకులను ట్యాపింగ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించి రెండు కోట్ల నగదును తెచ్చారని.. 13 కోట్లు విలువైన బాండ్స్ ను కొనిపించారని రఘునందన్ రావు ఆరోపించారు. దీనిపై పోలీసులు వెంటనే విచారణ చేయాలని రఘునందన్ రావు కోరారు.