కామారెడ్డి, వెలుగు: ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఇల్లు కట్టుకునే కేసీఆర్‌కు పేదలకు ఇండ్లు కట్టించేందుకు మాత్రం మనసు రావడంలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. డబుల్బెడ్రూమ్ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్‌చేస్తూ బీజేసీ స్టేట్కమిటీ పిలుపు మేరకు సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ఆఫీస్ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రెసిడెంట్అరుణతార అధ్యక్షతన జరిగిన ధర్నాలో రఘునందన్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అన్ని రాష్ట్రాల్లో ఇండ్లు కట్టించారని, మన స్టేట్‌లో మాత్రం డబుల్బెడ్రూం ఇండ్లకు ఫండ్స్ మళ్లీంచారన్నారు. కట్టిన ఇండ్లను పేదలకు పంపిణీ చేయకపోవడం సరికాదన్నారు.
దళిత బంధు అంతా అవినీతిమయమని, బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయకముందే కొత్తగా మైనార్టీలకు ఆర్థికసాయమంటూ ప్రకటించారన్నారు. ఎన్నికలొచ్చినప్పుడే కేసీఆర్‌కు కొత్త స్కీమ్‌లు యాదికొస్తున్నాయన్నారు. జిల్లా ప్రెసిడెంట్అరుణతార, కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నీలం చిన్న రాజు, జిల్లా జనరల్ సెక్రెటరీ బాపురెడ్డి, కౌన్సిలర్లు, లీడర్లు పాల్గొన్నారు.