
సిద్దిపేట టౌన్, వెలుగు : పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ గడ్డపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటుచేసిన నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశంలో రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ 17 ఎంపీ సీట్లు గెలవబోతుందన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ నాలుగు వేల నిరుద్యోగ భృతి, రూ.4 వేల పెన్షన్ ఇస్తామని ప్రగల్బాలు పలికిన రేవంత్ రెడ్డి
వంద రోజులు గడిచిన ఎందుకు హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు దూది శ్రీకాంత్ రెడ్డి, తొడుపునూరి వెంకటేశం, వంగ రామచంద్రరావు, కొత్త వేణుగోపాల్ రెడ్డి, ఉపేందర్, మహిళా నాయకురాలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.