
దుబ్బాక, వెలుగు : కేసీఆర్పైసలు, పోలీసోళ్లను నమ్ముకుంటే బీజేపీ ప్రజలను నమ్ముకుని ఎన్నికల రంగంలోకి దిగిందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. మంగళవారం దుబ్బాక మారెమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్పాత్రతో కలిసి దుబ్బాకలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయంత్రం ఆరు దాటితే అనారోగ్యానికి గురైన ప్రజలకు డాక్లర్లు దొరకరు గానీ కేసీఆర్‌కు ఇష్టమైన లిక్కర్ మాత్రం పుష్కలంగా దొరుకుతుందని ఎద్దేవా చేశారు.
నదులకు నడక నేర్పిన కేసీఆర్ గోదావరిపై రూ. లక్ష కోట్లతో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ పనికి రాకుండా పోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్ ఉద్యోగాన్ని భర్తీ చేయలేదని, లీకేజీల పేరుతో కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. మీ ప్రభుత్వం కారణంగా సూసైడ్ చేసుకున్న నిరుద్యోగుల ఇంటికి మంత్రి హరీశ్‌రావు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. యువ మేళా సమ్మేళన పేరుతో మంత్రి కేటీఆర్ ఏ మొఖం పెట్టుకుని దుబ్బాకకు వస్తున్నారని ధ్వజమెత్తారు. తొమ్మిదేండ్లుగా ఎంపీగా పని చేస్తున్న ప్రభాకర్‌రెడ్డి దుబ్బాకకు నిధులివ్వకుండా గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలకు నిధులు ఎలా కేటాయిస్తారని మండిపడ్డారు.