
- మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు
దుబ్బాక, వెలుగు: ఓటమి విజయానికి నాందిగా భావించాలని, ఓటమితో కుంగి పోవద్దని, గెలుపుతో పొంగి పోవద్దని మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు బీజేపీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. శనివారం అక్భర్పేట-భూంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో జరిగిన లోటు పాట్లను సరి చేసుకుని ముందుకెళ్లాలని కోరారు.
దేశం కోసం, ధర్మం కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని పిలుపు నిచ్చారు. కేంద్రంలో మరోసారి రానున్నది మోదీ సర్కారే అని, కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేస్తే రానున్న పార్లమెంట్ఎన్నికల్లో మెదక్‌లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. ఓడిపోయామనే బాధ నుంచి బయట పడాలని భవిష్యత్ కోసం ఆలోచన చేయాలని కార్యకర్తలకు సూచించారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌సభ్యుడు అంబటి బాలేశ్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ ఎస్ఎన్ చారీ, చేగుంట మాజీ ఎంపీపీ కర్నె పాండు, నాయకులు వెంగళ్రావు, కానుగంటి శ్రీనివాస్, మద్దెల రోశయ్య, అరిగె కృష్ణ, భిక్షపతి, పుట్ట వంశీ, మచ్చ శ్రీనివాస్, సాయిలు పాల్గొన్నారు.