బండి సంజయ్ పరామర్శకు వచ్చిన రఘునందన్ రావు అరెస్టు

బండి సంజయ్ పరామర్శకు వచ్చిన రఘునందన్ రావు అరెస్టు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పరామర్శించడానికి వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరామర్శించడానికి వచ్చిన వాళ్లను అరెస్ట్ చేయడం ఏంటని, తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని రఘునందన్ రావు.. పోలీసులను ప్రశ్నించారు. రఘునందన్ రావుతో పాటు మరికొందరు మహిళా బేజేపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ ముందు మరింత ఉద్రిక్త పరిస్థులు నెలకొంది. 

ఏ చట్ట ప్రకారం తనను అరెస్ట్ చేస్తున్నారని రఘునందన్ రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై సీరియస్ అయిన రఘునందన్ రావును పోలీస్ వెహికిల్స్ లోకి బలవంతంగా ఎక్కించుకొని స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో దుర్మార్గుల పాలన నడుస్తోందని, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా అర్థరాత్రి పోలీసులను అరెస్ట్ చేయడం ఏంటని రాష్ట్ర తీరుపై మండి పడ్డారు.