
దుబ్బాక, వెలుగు: ప్రభుత్వ మార్పు కోసం ప్రజలు బీజేపీకి ఓట్లేస్తారన్న నమ్మకం ఉందని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు. గురువారం స్వగ్రామమైన అక్భర్పేట-భూంపల్లి మండలం బొప్పాపూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో వినియోగించుంటున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి తెరపడిన మరుక్షణం నుంచే కొన్ని పార్టీల నాయకులు వేల రూపాయలతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కుట్ర చేశారన్నారు. వివేకంతో ఆలోచన చేసే తెలంగాణ ప్రజలు మార్పు కోసం ఓటేస్తారని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.