మంచిర్యాల బీజేపీ అభ్యర్థిగా రఘునాథ్

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల నియోజకవర్గ బీజేపీ టికెట్ ఊహించినట్లుగానే​ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​ రావుకు దక్కింది. గురువారం రిలీజ్ ​చేసిన థర్డ్​ లిస్టులో ఆయన పేరును పార్టీ హైకమాండ్​ ప్రకటించింది. రఘునాథ్​ రావు 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై పోరాడుతూనే.. మరోవైపు రఘునాథ్​ వెరబెల్లి ఫౌండేషన్​ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు దగ్గరయ్యారు. రఘునాథ్​కు భార్య స్రవంతి, కూతుళ్లు అరుణిమ, అన్విత ఉన్నారు. 

ఆసిఫాబాద్ నుంచి ఆత్మారాం నాయక్

ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ నియోజవర్గం బీజేపీ అభ్యర్థిగా అజ్మీర ఆత్మారాం నాయక్ వైపే పార్టీ హైకమాండ్​ మొగ్గుచూపింది. గురువారం రిలీజ్​చేసిన థర్డ్ లిస్టులో ఆయన పేరును ప్రకటించారు. గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఆత్మారాం మూడో స్థానంలో నిలిచారు. అధిష్టానం ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వడంతో పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు.

ALSO READ : అవసరమైతే మరిన్ని చెక్​పోస్టులు ఏర్పాటు చేస్తం : సీపీ డీఎస్ చౌహాన్